Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటలకు కేసీఆర్ గాలం వేస్తున్నారా ?

ఈటలకు కేసీఆర్ గాలం వేస్తున్నారా ?
-అసెంబ్లీ లో పలుమార్లు ఈటెల పేరు ప్రస్తహించిన సీఎం కేసీఆర్
-ఈటల చెప్పిన మాటలు నోట్ చేసుకోండని హరీష్ కు ఆదేశం
-డైట్ విషయంలో ఆయన సలహాలు తీసుకోవాలని సూచన
-దీనిపై స్పందించిన ఈటెల
-ఇవాళ సీఎం కేసీఆర్ నా పేరు ప్రస్తావించారని పొంగిపోనని స్పష్టికరణ
-సభలో పలుమార్లు ఈటల గురించి మాట్లాడిన కేసీఆర్
-తనపై చేసిన దాడిని మర్చిపోనన్న ఈటల
-టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సైనికుడిలా పనిచేశానని వెల్లడి
-తాను పార్టీ మారలేదని బలవంతంగా పంపించారని అన్న ఈటెల

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తిరిగి సీఎం కేసీఆర్ గాలం వేస్తున్నారా ?అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు …మంత్రిగా ఉన్న ఈటెలను భూకబ్జా ఆరోపణలతో పార్టీ నుంచి బలవంతంగా బయటకు పంపించారు . ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజా తీర్పును కోరారు . హుజురాబాద్ ప్రజలు బీజేపీ అభ్యర్థిగా పోటిచేసిన ఈటల కు ఘనమైన మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు . బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఈటెలను తిరిగి బీఆర్ యస్ లోకి తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారా లేక ఆయన్ను బ్లేమ్ చేసేందుకు మాటిమాటికి కేసీఆర్ ఈటెల పేరు పేరు ప్రస్తావించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణ బడ్జెట్ సమావేశాల చివరిరోజు సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ పలుమార్లు ఈటల రాజేందర్ పేరు పలికారు.

ఆనాడు తమకు సన్న బియ్యం సలహా ఇచ్చింది ఈటలేనని కేసీఆర్ వెల్లడించారు. కమ్యూనిటీ హాళ్లకు సంబంధించిన నామకరణం కూడా మా ఈటల ఆలోచనే అని తెలిపారు. డైట్ చార్జీలు పెంచాలని ఈటల కోరారు… పెంచుతున్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.

అంతేకాదు, ఈటలకు ఫోన్ చేసి సూచనలు, సలహాలు తీసుకోవాలని తెలిపారు. మరీ ముఖ్యంగా… ఈటల మాట్లాడిన మాటల్లో ముఖ్యాంశాలను నోట్ చేసుకోవాలని మంత్రి హరీశ్ రావుకు సూచించారు.

దీనిపై ఈటల స్పందించారు. ఇవాళ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నా పేరు ప్రస్తావించారని పొంగిపోను…. నా మీద జరిగిన దాడిని మర్చిపోను అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సైనికుడిలా పనిచేశానని, ఇప్పుడు బీజేపీలో కూడా అలాగే పనిచేస్తానని వెల్లడించారు.

“నాకు నేనుగా పార్టీ నుంచి వెళ్లిపోలేదు. వాళ్లే నన్ను పార్టీ నుంచి గెంటివేశారు. నన్ను గెంటివేసినవాళ్లు పిలిచినా వెళ్లను. అసెంబ్లీలో నా సొంత అజెండా ఏమీ ఉండదు. ఈ సభలో వాళ్లు చెప్పిందంతా మేం నమ్ముతామని బీఆర్ఎస్ అనుకుంటోంది. మమ్మల్ని తిట్టడానికే సభా సమావేశాలు ఏర్పాటు చేశారు. సంఖ్యా బలం ఉండడంతో గంటల కొద్దీ మాట్లాడారు. జనాలను మభ్యపెట్టి మాయ చేయాలని చూశారు” అంటూ ఈటల విమర్శనాస్త్రాలు సంధించారు.

Related posts

ఎమ్మెల్యే వంశీపై సీనియర్ నేత దుట్టా ఫైర్!

Drukpadam

ఓట్ల కోసమే బీసీ బందు …మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్..!

Drukpadam

బీఆర్ఎస్ పెట్టుకోండి… వీఆర్ఎస్ తీసుకోండి: ర‌ఘునంద‌న్ రావు!

Drukpadam

Leave a Comment