Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మావోయిస్టులతో కలిసి పెరిగా…డైరక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు

మావోయిస్టులతో కలిసి పెరిగా…డైరక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు

వారి విధానాలు నచ్చి దళంలో చేరాలనుకున్నా
గన్ పెట్టాల్సిన చేస్తులతో పెన్ను పట్టా …
లేకపోతె ఎప్పుడో అమరుడను అయ్యేవాణ్ణి

తెలంగాణ రాష్ట్ర డైరక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాస్ రావు ఏది చెప్పిన ,చేసిన ఆసక్తికరంగా ఉంటుంది. తాను మావోయిస్టుల బాటలో పెరిగానని ,వారి విధానాలు నచ్చి దళంలో చేరాలనుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు . దళంలో చేరి అడివిలోకి వెళ్లి ఉంటె ఎప్పడు అమరుడిని అయ్యేవాడినని అన్నారు . అయితే గన్ వల్ల ప్రయోజనం లేదని అందరు గన్ లు వదిలేసి పెన్నులు పట్టుకోవాలని పేర్కొన్నారు . గతంలో కూడా కేసీఆర్ కాళ్లు కు మొక్కడంపై కూడా విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం బాధ్యతగల అధికారిగా రాష్ట్ర డైరెక్టర్ గా ఉన్న శ్రీనివాస్ రావు తన చర్యలు సమర్ధించుకొనే ప్రయత్నం చేశారు . తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని ఆయన తెలంగాణ గాంధీ లాంటి వాడని చెప్పుకొచ్చారు . అదే విధంగా కొత్తగూడం లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రిస్మస్ సందర్భంగా పాల్గొని మాట్లాడుతూ క్రీస్తు వల్లనే కరోనా తగ్గిపోయిందని చెప్పారు .

ఇంతకీ శ్రీనివాస్ రావు ఇలాంటి చర్యలకు కారణం ఏమిటని విచారించగా ఆయన రానున్న ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీచేయాలని ఎత్తులు వేస్తున్నారు .అందులో భాగంగా ఆయన సీఎం కాళ్లు మొక్కడం ,మావోయిస్టుల పై మాటలు ,క్రీస్తు వల్లనే కరోనా తగ్గిందని క్రిస్టియన్ల మనుసు దోచుకునే విధంగా మాట్లాడటం జరుగుతుందని గుసగుసలు బయలు దేరాయి.

Related posts

నేను ‘సారాయి వీర్రాజు’ కాదు…

Drukpadam

భారతీయుల డీ ఎన్ ఏ ఒక్కటే: మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు!

Drukpadam

2024 లో కుప్పం లో భరత్, పలమనేరులో వెంకేటేష్ గౌడ్ వైసీపీ అభ్యర్థులు: పెద్దిరెడ్డి !

Drukpadam

Leave a Comment