Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్​గా బండా ప్రకాశ్​ ఎన్నిక ఏకగ్రీవం!

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్​గా బండా ప్రకాశ్​ ఎన్నిక ఏకగ్రీవం!

  • అభినందించిన సీఎం కేసీఆర్
  • ప్రకాశ్ ఈ పదవి చేపట్టడం అందరికీ గర్వకారణం అని వ్యాఖ్య
  • ముదిరాజ్ ల అభివృద్ధికి కృషి చేశారన్న సీఎం కేసీఆర్

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మండలిలో డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎన్నిక జరిగింది. ప్రకాశ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ను సీఎం కేసీఆర్ అభినందించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి మండలిలో డిప్యూటీ చైర్మన్ కూర్చీలో కూర్చొబెట్టారు.

ప్రకాశ్ ఈ పదవి చేపట్టడం  కావడం అందరికీ గర్వకారణం అన్నారు. సామాన్య కుటుంబం నుంచి ప్రకాశ్ ఎదిగారని, ముదిరాజ్ ల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. 1981లో మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించిన బండా ప్రకాశ్ 2017లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు.

Related posts

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ధీరజ్ సింగ్ ఠాకూర్.. ఆయన గురించి కొన్ని వివరాలు!

Ram Narayana

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాం విచారణలో ఈడీ దూకుడు!

Drukpadam

చెన్నైలో ఉన్నట్టుండి బైక్ లో మంటలు.. గాయాలతో తప్పించుకున్న యజమాని!

Drukpadam

Leave a Comment