పాదయాత్రలో కల్లుతాగిన వైయస్ షర్మిల….
-పాలకుర్తిలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
-ఒక మహిళగా అత్యధిక కిలోమీటర్ల పాదయాత్ర
-తెలంగాణ లో వైయస్ సంక్షేమ పథకాలు అమలు చేస్తాని ప్రచారం ..
నియోజకవర్గంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా షర్మిల పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాలకుర్తి నియోజకవర్గంలోని లక్ష్మీనారాయణంపురం లో కల్లు గీత కార్మికుని కోరిక మేరకు షర్మిల నీరా రుచి చూశారు. గీత కార్మికునితో కాసేపు మాట్లాడిన షర్మిల వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆమె కల్లుతాగిన విషయం ప్రచారం జరగటంతో రాష్ట్రమంతా ఆసక్తిగా చర్చ జరుగుతుంది.