Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మంచుపై స్కీయింగ్ చేస్తున్న రాహుల్ గాంధీ.. !

మంచుపై స్కీయింగ్ చేస్తున్న రాహుల్ గాంధీ.. !

  • గుల్మార్గ్ లో సేదతీరుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్
  • రెండు రోజుల వ్యక్తిగత పర్యటన కోసం వచ్చారన్న పార్టీ నేతలు
  • ఇటీవలే 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పూర్తిచేసిన కాంగ్రెస్ మాజీ చీఫ్

కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ జమ్మూకశ్మీర్ లోని గుల్మార్గ్ లో సేదతీరుతున్నారు. రెండు రోజుల వ్యక్తిగత పర్యటన కోసం బుధవారం కశ్మీర్ చేరుకున్నారు. గుల్మార్గ్ లోని ఓ స్కీయింగ్ రిసార్టులో రాహుల్ గాంధీ విడిది చేశారు. ఈ సందర్భంగా మంచుపై స్కీయింగ్ చేస్తూ ఆయన ఎంజాయ్ చేశారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటనేనని, వ్యాలీలో జరుగుతున్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు రాహుల్ వచ్చారని పార్టీకి చెందిన స్థానిక నేతలు చెప్పారు. రాహుల్ గాంధీ గురువారం రాత్రి తిరిగి ఢిల్లీకి వెళతారని సమాచారం.

ఇటీవలే కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా రాహుల్ మొత్తం 12 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం మీదుగా సుమారు 4 వేల కిలోమీటర్లు నడిచారు. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ ఎంపీ ఈ పర్సనల్ టూర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. రిసార్టులో స్కీయింగ్ ప్రారంభించడానికి ముందు స్థానికులతో కలిసి రాహుల్ సెల్ఫీలకు పోజిచ్చారు. రాహుల్ గాంధీ స్కీయింగ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

నియంత్రణ కోల్పోయి భూమిపైకి దూసుకొస్తున్న చైనా రాకెట్.. సర్వత్రా భయం, భయం!

Drukpadam

ఇమ్రాన్ ఖాన్ ‘ఆజాదీ మార్చ్’పై పాక్ రక్షణ మంత్రి తీవ్ర ఆరోపణలు..

Drukpadam

బెజవాడ జనసంద్రం… పోటెత్తిన ఉద్యోగులు…

Drukpadam

Leave a Comment