Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

తాను ముక్కుసూటి మనిషిని… సినీనటుడు జగపతిబాబు…

నా లైఫ్ అంతా రికార్డ్ చేసి పెట్టాను .. అందులో అన్ని విషయాలూ ఉన్నాయ్ : జగపతిబాబు…

  • తాను ముక్కుసూటి మనిషినని చెప్పిన జగపతిబాబు 
  • రేటింగుల కోసం తనని వాడుకోవడాన్ని సహించనని వెల్లడి
  • తన లైఫ్ గురించి తానే చెబుతూ ఒక వీడియో చేశానని వివరణ 
  • దానిని బయటికి ఇస్తే కాంట్రవర్సీ చేసే వారే ఎక్కువని వ్యాఖ్య 

తెలుగులో ముందుగా విలన్ గా చేసి, ఆ తరువాత హీరోలైన వారు కొంతమంది ఉన్నారు. కానీ ముందుగా హీరోగా చేసి, ఆ తరువాత స్టార్ విలన్ అనిపించుకున్నది మాత్రం ఒక్క జగపతిబాబు మాత్రమే. అలాంటి జగపతిబాబు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. “నేను ఎక్కడికి వెళ్లినా ఏ విషయాన్ని గురించి మాట్లాడాలనుకున్నానో ఆ విషయాన్ని గురించి మాత్రమే మాట్లాడతాను. రేటింగుల కోసం టాపిక్ మారిస్తే నాకు కోపం వస్తుంది” అన్నారు.

“నేను నా లైఫ్ అంతా పన్నెండున్నర గంటల నిడివితో ఒక వీడియోగా రికార్డు చేసి పెట్టాను. ఒక రకంగా ఇది విజువల్ ఆటో బయోగ్రఫీ అనుకోవచ్చు. నా లైఫ్ గురించి నేనే చెబుతూ వెళ్లాను. అందుకు సంబంధించిన షూటింగును ‘గోవా’లో .. ‘కేరళ’లో చేశాము. అది మొత్తం ఒక్కసారిగా చూడటానికి బోర్ కొట్టొచ్చు .. పోనీ బిట్స్ గా వేసే ప్రయత్నం చేద్దామా అంటే, వాటిని గురించే వేరే రకంగా రాసేసి చెడగొడతారు. రకరకాల ప్రశ్నలతో విసిగించేస్తారు” అన్నారు.

“నా లైఫ్ గురించి చెప్పడానికి నేను ఎంచుకున్న విధానం మంచిదే .. అందులో మంచి విషయాలున్నాయి. ఆ వీడియోను ఇస్తే కాంట్రవర్సీ చేయడానికే ఎక్కువగా ట్రై చేస్తారు. న్యూ సెన్స్ చేయడానికే ఎక్కువమంది ప్రయత్నిస్తారు. ఆ తలనొప్పంతా ఎందుకని సైలెంట్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చారు.

Related posts

మా లో రాజకీయాలు 2 కోట్ల నిధులకు లెక్కలు లేవన్న హేమ…ఆమె క్రమశిక్షణ తప్పెరన్న నరేష్!

Drukpadam

అడకత్తెరలో పోకచెక్కలాగా తెలుగు సినీ నిర్మాతల మండలి!

Drukpadam

పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు: పేర్ని నాని!

Drukpadam

Leave a Comment