Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి నీ చెత్త వాగుడు కట్టి పెట్టు …ఎమ్మెల్సీ తాతా మధు ఫైర్!

పొంగులేటి నీ చెత్త వాగుడు కట్టి పెట్టు …ఎమ్మెల్సీ తాతా మధు ఫైర్!
-అబద్దాలు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించక తప్పదు …
-నువ్వు బీఆర్ యస్ లో ఉండి, మోడీ ,రాహుల్ గాంధీలను పొగిడావా – -నాడు కేసీఆర్, కేటీఆర్ లను పొగడలేదా..?
-ఇప్పుడు నామస్మరణ అంటూ వాగుతావా?
-పార్టీలో ఉండి 300 కోట్ల నుంచి 3 కోట్లు సంపాదించవా లేదా ?
-ఏడు సంవత్సరాలు ఉండి.. పార్టీకి ద్రోహం చేస్తావా?
-సీతారామ ప్రాజెక్టుకు నీవెందుకు టెండర్ వేశావు..?
-ధరణిలో నీ భూములు ఎంటర్ కాలేదా..?
-నీకు 120 ఎకరాల భూమి ఉంది నిజం కాదా ?

పొంగులేటి నీ చెత్తవాగుడు కట్టిపెట్టు …అభివృద్ధికి చిరునామాగా ఉన్న తెలంగాణ లో బురదచల్లటానికి ప్రయత్నిస్తే ప్రజాగ్రహంలో కొట్టుకొని పోక తప్పదని బీఆర్ యస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ,ఎమ్మెల్సీ తాతా మధు హెచ్చరించారు . వైరా ఆత్మీయ సమ్మేళనంలో మాజీఎంపీ పొంగులేటి కేసీఆర్ ప్రభుత్వం పై చేసిన విమర్శలపై ,ఎమ్మెల్యే రాములు నాయక్ తోకలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మండిపడ్డారు .7 సంవత్సరాల నాడు పార్టీలో చేరేటప్పుడు 3 కోట్ల ఆస్తులు కలిగిన నువ్వు 3 వేల కోట్లకు అధిపతివి ఎలా అయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు .బీఆర్ఎస్ లో ఏడు సంవత్సరాలు ఉండి, కలలన్నీ నెరవేర్చుకుని ఇప్పడు పార్టీకి ద్రోహం చేస్తావా? నోటికి వచ్చినట్లు అవాకులు, చెవాకులు మాట్లాడుతావా? అంటూ ఫైర్ అయ్యారు . అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ఈ క్రమంలోనే చేరికలు జరిగి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరారని చెప్పారు. తాను ఆస్తులు కూడబెట్టుకొని పార్టీపై నిందలు వేయడం గురివింద సామెతగా ఉందని ధ్వజమెత్తారు .

పార్టీలో ఉన్న నాయకులందరూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నామజపమే చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి అన్నారని, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరి జపం చేశారని ఆగ్రహించారు. నాడు పొగిడిన నోటితోనే నేడు ఆరోపణలు చేయడం ఆయన రాజకీయ పరిపక్వతకు అద్ధం పడుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల గురించి గొప్పగా చెప్పకుండా మోదీ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతామా? అంటూ ప్రశ్నించారు.

ధరణి తప్పుల కుప్పగా మారిందని పొంగులేటి అంటున్నాడని ఆయనకు చెందిన 108 ఎకరాల భూములు ధరణిలో ఎంటర్ కాలేదా? అని తాతా మధు ప్రశ్నించారు. పాస్ బుక్కులు పొందలేదా? పాస్ బుక్స్ పొందింది వాస్తవం కాదా ? కొత్త సాఫ్ట్ వేర్ కారణంగా చిన్నచిన్న పొరపాట్లు జరగడం సహజమని, అవికూడా లేకుండా చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఇంకా సీతారామ ప్రాజెక్టు 15 ఏండ్లు అయినా పూర్తి కాదన్న పొంగులేటి మాటలకు తాత కౌంటర్ ఇచ్చారు. 15 ఏండ్లకు కూడా పూర్తి కాని ప్రాజెక్టుకు నీవెందుకు టెండర్ వేశావని, టెండర్ వేసిన ఆధారాలు మొత్తం తన దగ్గర ఉన్నాయని విలేకరుల సమావేశంలో పత్రాలను చూపించారు. ఆర్థికంగా లబ్ధి పొందేందుకు మాత్రం టెండర్ వేస్తావా? తర్వాత ప్రాజెక్టు పూర్తవుతుందో లేదోనంటూ ప్రజలకు కల్లబోల్లి కబుర్లు చెబుతావా? అంటూ విమర్శించారు. నువు విమర్శించే ప్రతీ మాటకు బీఆర్ఎస్ దగ్గర సమాధానం ఉన్నదని స్పష్టం చేశారు. పొంగులేటి ఏం చదువుకున్నాడో తనకైతే తెలియది కానీ.. మానసిక పరిస్థతి మాత్రం బాగోలేదని అర్థం అవుతుందని అన్నారు. ప్రజా కోర్టులో తనకు శిక్ష పడటం ఖాయమని, ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని, కర్రుకాల్చి వాత పెడతారని హెచ్చరించారు. పొంగులేటి ఏర్పాటుచేసుకునే సన్నాహక సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని, పార్టీలో ఉండి లబ్ధి పొంది, ఇప్పడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదని తా మధు హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం గారు, ఖమ్మం నగర మేయర్ నీరజ గారు, ఖమ్మం నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు గారు, జిల్లా రైతు సమితి అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వర్లు గారు, కార్పొరేటర్ కమర్తపు మురళి గారు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఖమర్ గారు, తెలంగాణ ఉద్యమకారు సుబ్బారావు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పదికి పదీ గెలిపిస్తాం..సత్తుపల్లి కృతజ్ఞతా సభలో మంత్రి అజయ్

Drukpadam

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తో బంధం తెంచుకోబోతున్నారా ?

Drukpadam

సాగర్ ఎన్నిక మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకం

Drukpadam

Leave a Comment