Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

శ్రీనివాస్ గౌడ్ పై సొంతపార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫైర్

శ్రీనివాస్ గౌడ్ పై సొంతపార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫైర్
-పద్మశ్రీ గ్రహీత మొగిలయ్య కు ఇంటిస్థలం కేటాయింపు వ్యవహారం -బంజారాహిల్స్ ,జూబ్లీ హిల్స్ లో కాకుండా ఎక్కడో ఇచ్చారని విమర్శ
-శ్రీనివాస్ గౌడ్ వ్యవహారాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్న ఎమ్మెల్యే
-కిన్నెరమెట్ల మొగిలయ్యకు బీఎన్ రెడ్డి నగర్ లో ఇంటి స్థలం కేటాయించడంపై అసంతృప్తి
-బంజారా హిల్స్ లేదా జూబ్లీ హిల్స్ లో స్థలం ఇవ్వాలని డిమాండ్
-ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న మొగిలయ్య

బీఆర్ యస్ లో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. అనేక జిల్లాల్లో మంత్రులపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు . ఇదే పలుసార్లు ఆయసందర్భాల్లో ఎమ్మెల్యేలు వారి అనుయాయిలు మంత్రులపై ఉన్న అసంతృప్తిని వెలిబుచ్చారు. పార్టీ నాయకత్వం ఎవరిని మందలించిన దాఖలాలు లేకపోవడంతో అది పెరుగుతుంది.దీంతో గళాల సంఖ్య పెరుగుతుంది. ఈనేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫైర్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది .

సొంతపార్టీ పార్టీ మంత్రిని ఎమ్మెల్యే విమర్శించడం పై జిల్లాలోని నేతలు సైతం చెవులు కొరుక్కుంటున్నారు . మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు పార్టీకి నష్టాన్ని కలిగిస్తాయని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం …

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శలు గుప్పించారు. కిన్నెరమెట్ల కళాకారుడు, పద్మశ్రీ మొగిలయ్యకు హైదరాబాద్ శివారులోని బీఎన్ రెడ్డి నగర్ లో ఇంటి స్థలం కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. క్రీడాకారులకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఇంటి స్థలం ఇచ్చి, మొగిలయ్యకు నగర శివారులో స్థలం కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కళాకారులకు కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోనే స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.

శ్రీనివాస్ గౌడ్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 2 కోట్ల నగదును ప్రకటించింది. దీంతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించింది. మొగిలయ్యకు రూ. కోటి నగదు, ఆయన కోరుకున్న విధంగా బీఎన్ రెడ్డి కాలనీలో ఇంటి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గువ్వల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

Related posts

పీఎం కేర్స్ నిధులపై ఎన్డీటీవీ కథనం …రాహుల్ గాంధీ స్పందన !

Drukpadam

నల్లారి, సినీ నటుడు మోహన్ బాబు బీజేపీ వైపు చూస్తున్నారా …?

Drukpadam

ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా విజ‌యం సాధించాల్సిందే!… టీడీపీ మ‌హానాడు తీర్మానం

Drukpadam

Leave a Comment