Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

న్యాయం కోసం లంచం ఇవ్వలేను.. ఇందిరా పార్క్ వద్ద ఓ రైతు నిరసన!

న్యాయం కోసం లంచం ఇవ్వలేను.. ఇందిరా పార్క్ వద్ద ఓ రైతు నిరసన!

  • తప్పుడు పత్రాలు సృష్టించి తన భూమి కాజేశారని ఆరోపణ
  • తన భూమిని తమ్ముడికి కట్టబెట్టారని బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు
  • వరంగల్ జిల్లా పొనకల్ గ్రామానికి చెందిన రైతు ఆందోళన

నకిలీ పత్రాలు సృష్టించి తన భూమిని కాజేశారంటూ వరంగల్ జిల్లా పొనకల్ కు చెందిన రైతు గట్ల సురేందర్ హైదరాబాద్ లో ఆందోళన చేస్తున్నాడు. ఇందిరా పార్క్ వద్ద భుజాన నాగలి పెట్టుకుని, న్యాయం కోసం లంచం ఇవ్వలేనంటూ ఓ బ్యానర్ తో నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. తన భూమిని తప్పుడు పత్రాలతో తన తమ్ముడికి కట్టబెట్టారని, పొనకల్ కు చెందిన బీఆర్ఎస్ నాయకులే ఈ పని చేశారని ఆరోపించాడు.

ఇందిరా పార్క్ నుంచి అర్ధనగ్నంగా, భుజాన నాగలి, చేతిలో ఉరితాడుతో గట్ల సురేందర్ నడుచుకుంటూ డీజీపీ కార్యాలయానికి చేరుకున్నాడు. పోలీసులను ఉన్నతాధికారులను కలిసినా తనకు న్యాయం జరగలేదని సురేందర్ చెప్పాడు. వారు చూపిస్తున్న ఒరిజినల్ పేపర్లను పరిశీలించాలని డీజీపీని కోరారు. ఆ పత్రాలు సరైనవైతే తనను హైదరాబాద్ నడిబొడ్డున ఉరి తీయాలని అన్నాడు.

ఈ విషయంలో గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర డీజీపీ జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. అయితే, డీజీపీని కలిసి వినతిపత్రం అందజేసేందుకు సురేందర్ ప్రయత్నించగా.. పోలీసులు అతడిని డీజీపీ కార్యాలయంలోకి అనుమతించలేదు.

Related posts

సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పిటిష‌న్‌పై ఏపీ హైకోర్టులో విచార‌ణ!

Drukpadam

రాహుల్ యాత్రకు మద్దతు ఇవ్వాలని రామోజీరావును కలిసిన రేవంత్ రెడ్డి…

Drukpadam

ఎలక్ట్రానిక్స్‌ డే పేరిట అమెజాన్‌ కొత్త సేల్‌ సీజన్

Drukpadam

Leave a Comment