Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాములు నాయక్ కు వైరా సీటు ఖాయమేనా …?

రాములు నాయక్ కు వైరా సీటు ఖాయమేనా …?
-రాములు నాయక్ కు వ్యూహం ఫలిస్తుందా ?
-లేక పొత్తుల ఎత్తుల్లో లెఫ్ట్ పోటీచేస్తుందా ?
-పొంగులేటి వ్యతిరేకంగా పార్టీకి అండగా నిలిచిన రాములు నాయక్
-ఎన్నికల్లో సహకరించిన నేతనే ఎదిరించిన రాములు నాయక్
-పొంగులేటికి రాములు నాయక్ కు మధ్య గ్యాప్ కు కారణమేంటి

బీఆర్ యస్ నుంచి రాములు నాయక్ కు సీటు ఖాయమేనా ? ఆయన వ్యూహం ఫలిస్తుందా ? అంటే అది కేసీఆర్ చేతిలో ఉందని అంటున్నారు పరిశీలకులు … గతఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి అధికార పార్టీ అభ్యర్థిగా పోటిచేసిన మదన్ లాల్ పై గెలుపొందారు . రాములు నాయక్ విజయంలో నాడు ఎంపీగా ఉండి, గులాబీ పార్టీలో కీలక నేతగా ఉన్న పొంగులేటి ,ఆయన అనుయాయులు కీలక పాత్ర పోషించారు . పొంగులేటి తన అండదండలతో గెలించిన రాములు నాయక్ ను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకోని పోయి పార్టీలో చేర్పించారు . ఎమ్మెల్యే రాములు నాయక్ సైతం చాలాకాలం పొంగులేటి వెంటే ఉన్నారు . పొంగులేటి పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో , గత కొంతకాలంగా ఆయన కు దూరంగా ఉంటూ వస్తున్నారు.

జిల్లా లో రాజకీయ పరిణామాల్లో పార్టీలో పొంగులేటికి ఎలాంటి ప్రాధాన్యత లేక పోవడం , కనీసం పట్టించుకోకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నారు . 2023 జనవరి నుంచి ఆయన పార్టీ పై బహిరంగ విమర్శలు చేయడం పార్టీ సైతం ఆయన్ను దూరం పెట్టాలని నిర్ణయించుకోవడంతో ఎమ్మెల్యే రాములు నాయక్ పార్టీకి దగ్గరైయ్యారు . తన గెలుపు లో కీలక పాత్ర వహించిన పొంగులేటికి దూరమైయ్యారు . ఇంతవరకు బాగానే ఉంది .ఇక్కడ నుంచే అసలు సమస్య మొదలయ్యే అవకాశం ఉంది. ఈసారి రాములు నాయక్ టికెట్ వస్తుందా లేదా అనేది చెప్పలేని పరిస్థితి … అయితే పొంగులేటికి వ్యతిరేకంగా ఆయన బీఆర్ యస్ వెంట నడవడం ప్లస్ పాయింట్ … అందువల్ల గులాబీ బాస్ తిరిగి టికెట్ ఆయనకే ఇస్తారనే ఒకే ఒక ఆశ …అయితే కేసీఆర్ టికెట్ ఇచ్చే ముందు వివిధ రకాల రిపోర్టులను పరిశీలిస్తారు . అంతే కాదు …ఇంటలిజెన్స్ నివేదికలు సొంత సర్వే లు పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తారు .రాములు నాయక్ పనితీరు ఆధారంగా తిరిగి టికెట్ కేటాయింపు ఉంటుంది . అందులో రాములు నాయక్ టికెట్ ఇచ్చేవారి జాబితాలో ఉన్నారా లేదా అనేది ఆసక్తిగా మారింది. అదే సందర్భంలో గతంలో పార్టీ అభ్యర్థిగా పోటిచేసిన మదన్ లాల్ , డాక్టర్ చంద్రావతి లు కూడా ఈసారి అభ్యర్థి మార్పు ఖాయమని అందువల్ల టికెట్ ఆశిస్తున్నవారి జాబితాలో ఉన్నారు .

వైరా పై లెఫ్ట్ పట్టు …

బీఆర్ యస్ తో లెఫ్ట్ పార్టీలకు ఎన్నికల పొత్తు కుదిరితే సిపిఐ ,సిపిఎం పార్టీలు రెండు వైరా సీటు కోరుతున్నాయి. అయితే అంతకుముందు ఈసీటు సిపిఐ గెలిచింది .2009 లో సిపిఐ నుంచి పోటిచేసిన డాక్టర్ చంద్రావతి గెలుపొందారు . 2014 లో వైయస్సార్ సీపీ నుంచి పోటిచేసిన బానోత్ మదన్ లాల్ గెలుపొందారు . 2018 ఎన్నికల్లో ఆయన టీఆర్ యస్ పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు . గత ఎన్నికల్లో కాంగ్రెస్ ,సిపిఐ పొత్తులో భాగంగా సిపిఐ నుంచి విజయాబాయి పోటీచేశారు . ఆమె ఇప్పుడు పొంగులేటి శిబిరంలో చేరారు . ఇప్పటివరకు గులాబీ పార్టీ ఎన్నికల్లో వైరా లో గెలవలేదు … అందువల్ల ఈసీటు లెఫ్ట్ కు ఇస్తుందా ? లేక పోటీచేస్తుందా .. అనే ఆసక్తి నెలకొన్నది …

 

Related posts

బీఆర్ఎస్ రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందా?: కిషన్ రెడ్డి….

Drukpadam

అసదుద్దీన్ ప్రయాణిస్తున్న రైలుపై దాడి…నిజం కాదంటున్న గుజరాత్ పోలీసులు !

Drukpadam

కాంగ్రెస్ లో వైయస్ సంస్మరణ సభ చిచ్చు … కోమటిరెడ్డి వెళ్లడంపై భగ్గుభగ్గు!

Drukpadam

Leave a Comment