Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై బిక్కవోలు పీఎస్ లో కేసు నమోదు!

టీడీపీ అధినేత చంద్రబాబుపై బిక్కవోలు పీఎస్ లో కేసు నమోదు!

  • చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉద్రిక్తతలు
  • అనపర్తిలో పోలీసులపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
  • బిక్కవోలు పోలీసులకు ఫిర్యాదు చేసిన డీఎస్పీ భక్తవత్సలం

టీడీపీ అధినేత చంద్రబాబుపై తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించడంతో పాటు, దూషించారంటూ డీఎస్పీ భక్తవత్సలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఫిర్యాదు నేపథ్యంలో… చంద్రబాబు, మరో ఏడుగురు టీడీపీ నేతలపై కేసు నమోదైంది. చంద్రబాబు తదితరులపై 143, 353, 149, 188 సెక్షన్లు మోపినట్టు తెలుస్తోంది.

చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు రోడ్ షోకి అనుమతి లేదంటూ పోలీసులు బలభద్రపురం వద్ద అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా పోలీసులు రోడ్డుపై బైఠాయించారు.

దాంతో చంద్రబాబు వాహనం దిగి కాలినడకన 7 కిలోమీటర్లు ప్రయాణించి అనపర్తి చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు తన మైక్ లాక్కునేందుకు ప్రయత్నించారంటూ చంద్రబాబు మండిపడ్డారు.

రోడ్డుపై సభ వద్దని చంద్రబాబుకు చెప్పాం: డీఐజీ పాలరాజు

DIG Palaraju talks to media on Chandrababu meeting in Anaparthi
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలపై డీఐజీ పాలరాజు మీడియాతో మాట్లాడారు. తాము పర్మిషన్ ఇవ్వకపోయినా చంద్రబాబు సభ పెట్టారని ఆరోపించారు. ర్యాలీకి మాత్రమే అనుమతి ఉందని వెల్లడించారు. రోడ్డుపై సభ ఏర్పాటు చేయొద్దని చెప్పామని, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పామని వివరించారు. కానీ టీడీపీ నేతలు పోలీసుల మాట వినకుండా సభ పెట్టారని డీఐజీ తెలిపారు. పోలీసు వాహనం అద్దాలు పగులగొట్టారని వెల్లడించారు.

నిన్న అనపర్తిలో టీడీపీ సభ ఏర్పాటు చేయగా, అనుమతి లేదంటూ పోలీసులు చంద్రబాబును బలభద్రపురం వద్దే అడ్డుకోవడం తెలిసిందే. దాంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడిచింది. చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదలకుండా పోలీసులు తమ వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా పెట్టారు. పోలీసులు కూడా రోడ్డుపైనే బైఠాయించారు. అయితే చంద్రబాబు కాలినడకన అనపర్తి చేరుకుని సభలో పాల్గొన్నారు.

Related posts

కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యే కావాలంటున్న కర్ణాటక ప్రజలు ..

Drukpadam

పొంగులేటి దూకుడు …ఆయన కదలికలపై రాజకీయ పక్షాల ఆరా …!

Drukpadam

వైసీపీకి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మంచి మాట ….

Drukpadam

Leave a Comment