Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టర్కీ భూకంపంలో ఎన్ని వేల బిల్డింగులు కూలిపోయాయంటే..!

టర్కీ భూకంపంలో ఎన్ని వేల బిల్డింగులు కూలిపోయాయంటే..!

  • ఫిబ్రవరి 6న టర్కీని వణికించిన భూకంపం
  • 84,726 బిల్డింగులు ధ్వంసం
  • ఇప్పటి వరకు 41 వేల మందికి పైగా మృతి

ఇటీవల టర్కీ (తుర్కియా)ని పెను భూకంపం వణికించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6న సంభవించిన ఈ భూకంపం ఆ దేశాన్ని కోలుకోని విధంగా దెబ్బతీసింది. భూకంపం కారణంగా సుమారు 84,726 బిల్డింగులు ధ్వంసమయ్యాయని ఆ దేశ పర్యావరణ, పట్టణ ప్రణాళిక మంత్రి మూరత్ కుమార్ వెల్లడించారు. దేశంలోని 10 ప్రావిన్సుల్లో ఈ నష్టం సంభవించిందని చెప్పారు. అదానా నగరంలో డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

6.84 లక్షల బిల్డింగులను తమ శాఖ అధికారులు, సిబ్బంది పరిశీలించారని… వీటిలో 84 వేల బిల్డింగులు ధ్వంసమయినట్టు గుర్తించారని తెలిపారు. ఈ బిల్డింగుల్లో కొన్ని పూర్తిగా నేలమట్టమయ్యాయని చెప్పారు. బాగా డ్యామేజ్ అయిన బిల్డింగులను కూల్చేస్తామని తెలిపారు. బాగా దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇప్పటి వరకు భూకంపం వల్ల 41 వేల మందికి పైగా మృతి చెందారు. మరోవైపు టర్కీ అధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మాట్లాడుతూ మార్చిలో కొత్త బిల్డింగ్ ల నిర్మాణాలను చేపడతామని చెప్పారు. ఏడాదిలోగా నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపారు.

Related posts

కర్ణాటకలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్..

Drukpadam

హుజూరాబాద్‌లో లొల్లిలొల్లి..

Drukpadam

నీళ్లే నిప్పులై పేలాయ్.. మూడు రోజులవుతున్నా ఆరని మంటలు.. బంగ్లాదేశ్!

Drukpadam

Leave a Comment