Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి అరెస్ట్!

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి అరెస్ట్!
మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్‌పై అవినీతి ఆరోపణలు చేసిన షర్మిల
బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
షర్మిలను హైదరాబాద్ తరలించిన పోలీసులు

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు . మహబూబాబాద్‌లో నిన్న సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేసి హైద్రాబాద్ తరలించిన సంగతి తెలిసిందేనేడు మరోసారి ఆమె ను అరెస్ట్ చేయడం ఉత్కంఠంగా మారింది ….

శంకర్ నాయక్ అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు. దీంతో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయం షర్మిలను అరెస్ట్ చేశారు.

మహబూబ్ బాద్ సెంటర్ లో షర్మిల ప్రసంగం ….

మహబూబాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా సభలో పాల్గొన్న వైఎస్ షర్మిల మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనపై చేసిన విమర్శలపై ఫైర్ అయ్యారు . తాము ఇక్కడ జరుగుతున్నా సమస్యలను ప్రశ్నిస్తే కొజ్జాలు అంటావా..?శంకర్ నాయక్ ఎవడ్రా కొజ్జా..?అని నిలదీశారుహామీలు అమలు చేయని నువ్వు రా కొజ్జా..!హిజ్రాలతో నిన్ను పిలిచే వారికే అవమానంహిజ్రాలకు దేశంలో గౌరవం ఉంది. నీకు మాత్రం లేదుఇక్కడ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మేము ప్రజల పక్షాన నిలబడితే కొజ్జాలు అంటున్నాడు..ఏవడ్రా కొజ్జా శంకర్ నాయక్..?నువ్వు కాదారా కొజ్జా..? ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోక పోతే నువు కాదారా కొజ్జా..?రైతు రుణమాఫీ చేయక మీరు కోజ్జాలు కాక ఏమైతరు రా అని అడుగుతున్నఅని మండిపడ్డారు .. 6 నెలల్లో పోడు పట్టాలు ఇవ్వని మీరు కొజ్జాలు కాక ఏమైతర్రా అని అడుగుతున్నాంమీకు పరిపాలన చేతనయ్యిందా..? ఒక మహిళను పట్టుకొని కొజ్జా అని అంటావా..? నువు కొజ్జా అంటే నేను ఊరుకోవాలా..? అసలు రాష్ట్రంలో హిజ్రాలకు కూడా గౌరవం ఉంది….వారు దేశంలో గౌరవంగా బ్రతుకుతున్నారు
వైఎస్సార్ బిడ్డ గుండెల్లో వారికి స్థానం ఉంది ఎమ్మెల్యే కొజ్జా కంటే హీనంవాళ్ళతో పోల్చితే వాళ్ళను అవమాన పరిచినట్లే..?
మేము వలసదారులం అంటమరి నీ భార్య ఎక్కడ నుంచి వచ్చింది ..?నెల్లూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నవు కదా
నీకు తెలంగాణపై అంత ప్రేమ ఉంటే.. నీ భార్యకు విడాకులు ఇవ్వు..
నిజానికి నీ భార్య నీకు విడాకులు ఇవ్వాలిఒక ఐఏఎస్ చెయ్యి పట్టుకున్న నాడే నీకు విడాకులు ఇవ్వాల్సి ఉందిఒకప్పుడు గా పని చేసి ఏసీబీ లో పట్టుపడ్డాడని అంటున్నారు . …లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన దొంగ శంకర్ నాయక్ లంచగొండి ఉద్యోగం పోగొట్టుకొని ఎమ్మెల్యే అయ్యి కూర్చున్నాడు
లంచగొండి ఎమ్మెల్యే మొత్తం నియోజక వర్గాన్ని దోచుకున్నాడు
మొత్తం కబ్జాలు.గిరిజనుల భూములు కబ్జాలు,చెరువులు,శిఖం భూములు, అన్ని మాయంగుట్కా మాఫియా,ఇసుక మాఫియా,PDS రైస్ దందా,బెల్లం మాఫియా ఇలా అన్ని మాఫియా లేప్రతి నెల మామూళ్లు టంచన్ గా రావాల్సిందే నటఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవడం చేతకాలేదు

ఇక మహబూబాబాద్ ఎంపీ కవిత..మహిళ..బాగానే ఉంది
2009 లో ఇదే నియోజక వర్గానికి పిలిచి మరి ఎమ్మెల్యే ను చేశారు
కవితకు రాజకీయ భిక్ష పెట్టింది వైస్సార్ .. కవిత రాజకీయ పుట్టుక కారణం వైస్సార్వైస్సార్ మీద కృతజ్ఞత లేకుండా ఆయన బిడ్డ పై హీనంగా మాట్లాడావునీ విజ్ఞత కే వదిలి వేస్తున్న

కానీ ఒక్క మాట అడుగుతున్ననీకు ఏడాదికి 5 కోట్లు ఎంపీ లాడ్స్ వస్తున్నాయివాటితో ఎం చేశావో శ్వేత పత్రం విడుదల చెయ్యి
నన్ను తిట్టడం కాదు.. పార్లమెంట్ నియోజక వర్గానికి ఏం చేశావో చెప్పుఇదే మానుకోట వేదికగా సీఎం 2018 లో పోడు పట్టాలు ఇస్తా అని హామీ ఇచ్చాడు….ఇక్కడే కుర్చీ వేసుకొని కూర్చుంట అన్నారు
చీఫ్ సెక్రటరీ నీ తీసుకొని వస్తా అన్నారు….అధికారంలో వచ్చిన 4 ఏళ్లలో ఒక్క పట్టా ఇవ్వలేదు జిల్లాలో 1 లక్షా 40 వేల ఎకరాలకు పట్టాలు కావాలని అర్జీలు పెట్టుకున్నారుఒక్క పట్టా ఇచ్చింది లేదు కానీ.. అసెంబ్లీలో గిరిజన బిడ్డలను అవమాన పరిచే విధంగా మాట్లాడారుపోడు భూములు గిరిజనుల హక్కులు కాదట..
దయతలచి ఇస్తే తీసుకోవాలటముఖ్యమంత్రి గా ఉండి ఇదేనా మాట్లాడేది భూములకు హక్కులు లేక పోతే ఆరు నెలల్లో పోడు పట్టాలు అని హామీ ఇచ్చిన సన్నాసి ఎవరు..? హామీ ఇచ్చినప్పుడు తెలియదా..?. ఓట్ల కోసం ఒక మాట.. తర్వాత ఒక మాట
ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేస్తా అని హామీ ఇచ్చారు
ఏనాడైనా కేంద్రంతో రిజర్వేషన్లు పై పోరాటం చేశాడా..?
ప్రధాని మన రాష్ట్రం కోస్తే కనీసం అడిగే మొఖం లేదుకాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రెండు పంటలు నీళ్ళు అన్నారు….ఒక్క చుక్క నీరు ఇచ్చింది లేదు..?పైగా కాళేశ్వరం పై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు
మిడ్ మానెర్ నింపి నేరుగా మహబూబాబాద్ పట్టణానికి నీళ్ళు ఇస్తున్నారటచెవిలో పూలు, క్యాబేజీలు పెడుతున్నారుగిరిజనులకు పాల్ టెక్నిక్ కాలేజి అన్నారు ఇవ్వలేదుహార్టికల్చర్ కాలేజీ అన్నారు.ఇవ్వలేదుగిరిజనులకు ఇంజనీరింగ్ కాలేజీ అన్నారు.. రాలేదుప్రతి గిరిజన తాండా కి 10 లక్షలు ఇస్తా అన్నారు.. ఇచ్చింది లేదు మహబూబాబాద్ నియోజక వర్గానికి వైస్సార్ ఎంతో చేశాడుఎస్ ఆర్ ఎస్పీ కాలువల ద్వారా నీళ్ళు పారుతున్నయి అంటే వైఎస్ఆర్ కృషి కదా అని అన్నారు
కాలువలకు మరమత్తులు చేయించి,50 వేల ఎకరాలకు సాగునీరు అందించారు…. నియోజక వర్గంలో లక్ష డబుల్ బెడ్ రూం లు ఇచ్చారుమున్నేరు,గోవిందాపురం బ్రిడ్జీలను కట్టించారు
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో వేల మంది గిరిజన బిడ్డలు ఇంజనీర్లు అయ్యారుపాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి 23 వేల కోట్లు ఖర్చు పెట్టారు…23 వేల కోట్లు ఖర్చు పెట్టి త్రాగునీటి ప్రాజెక్టు అంటారా..?తెలంగాణ సొమ్ము మొత్తం బురదలో పోశారు
పాలమూరు జిల్లా ను సాగునీరు అని చెప్పి కేసీఅర్ మోసం చేశాడుఅని షర్మిల తెలంగాణ సర్కారుపై , ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై నిప్పులు చెరిగారు

Related posts

షర్మిల పార్టీ పేరు వైయస్సార్ తెలంగాణ పార్టీ ( Y S R T P )

Drukpadam

మ‌ళ్లీ మేమే అధికారంలోకి వ‌స్తాం: కేటీఆర్

Drukpadam

బీజేపీని వీడుతూ గుండు కొట్టించుకున్న ఎమ్మెల్యే..

Drukpadam

Leave a Comment