Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఇకలేరు …

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఇకలేరు …
-సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ ,రేవంత్ రెడ్డి సంతాపం
-సాయన్న మృతి పట్ల మంత్రి పువ్వాడ ఎంపీ వద్దిరాజు సంతాపం.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న (72) కన్నుమూశారు. గతకొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాయన్న తెదేపా (TDP)తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చదివారు. సాయన్నకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వివాదరహితుడిగా సాయన్న పేరు తెచ్చుకున్నారు. కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

సాయన్న తెదేపా తరఫున 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకరరావు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. 2014 తర్వాత సాయన్న భారాస లో చేరారు. 2015లో తితిదే పాలకమండలి సభ్యుడిగానూ పనిచేశారు. హుడా డైరెక్టర్‌గా 6సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. వీధిబాలలకు పునరావాసంపై హౌస్‌ కమిటీ ఛైర్మన్‌గా చేశారు. 2018 ఎన్నికల్లో భారాస తరఫున కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

సీఎం కేసీఆర్ సంతాపం …

సీఎం కేసీఆర్ సాయన్న మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు . ఎమ్మెల్యేల గా ఆయన సేవలు అమోఘమని , ఆయనతో కలిసి పనిచేసిన రోజులను సీఎం గుర్తు చేసుకున్నారు. సాయన్న భౌతిక ఖాయాన్ని సందర్శించి ,పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు ….కేసీఆర్ వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , మల్లారెడ్డి , డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లున్నారు.

ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయన్న కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రార్థించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సాయన్న మృతిపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సాయన్న అందరితో ఆత్మీయంగా మాట్లాడేవారన్నారు.

ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

సాయన్న అకాలమరణం దిగ్భ్రాంతి కలిగించింది: రేవంత్‌

ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘సాయన్న ఎంతో సౌమ్యుడు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో నగర ప్రజలకు ఎనలేని సేవలందించిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని రేవంత్‌ ట్వీట్‌ చేశారు.

గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న (72) మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నామ నాగేశ్వరరావు , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సంతాపం తెలియజేశారు.

ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయనకు ఉందని, ప్రజలతో ఎప్పుడు మమేకమై అనేక సమస్యలను పరిష్కరించి, మృదు స్వభావిగా మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు.

సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related posts

కేసీఆర్‌ కుటుంబమే టార్గెట్‌గా బీజేపీ బ్లాక్‌మెయిల్‌…ఎంపీ వద్దిరాజు

Drukpadam

భారత ప్రధాని మోదీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ మాటా మంతీ!

Drukpadam

ఉదయం పూట తినకూడని ఆహారపదార్థాలు!

Drukpadam

Leave a Comment