Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం జిల్లాలో పార్టీ డ్యామేజ్ కంట్రోల్ దిశగా బీఆర్ యస్ అడుగులు …

జిల్లాలో పార్టీ డ్యామేజ్ కంట్రోల్ దిశగా బీఆర్ యస్ అడుగులు …
-కలిసి నడిస్తే విజయం మనదేననే భావన …
-ప్రజల్లో విశ్వాసం కల్పించాలని బీఆర్ యస్ ఖమ్మం జిల్లా నేతలు నిర్ణయం ..
-జిల్లా అధ్యక్షులు తాతా మధు అధ్యక్షత ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశం…
-సీఎం కేసీఆర్ పథకాలు భేష్ …
-వాటికీ ప్రచారం కల్పించేందుకు ఐక్యంగా కదనరంగంలోకి …
-సీఎం జిల్లా పర్యటనల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలపై సమీక్ష
-పొంగులేటి వ్యవహారంపై చర్చ …ఆయన వెంట వెళ్లే నాయకుల -సంఖ్యను తగ్గించాలి …

ఖమ్మం జిల్లా బీఆర్ యస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దూరం కావడం పార్టీ విజయాలపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేకమంది నేతలు ముఖ్య పదవుల్లో ఉన్నవారు పొంగులేటి జైకొట్టడం పార్టీకి ఇబ్బందిగా మారింది .ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ,వైరా మున్సిపల్ చైర్మన్ సుతగాని జైపాల్ ,కొణిజర్ల ఎంపీపీ గోసు మధు ,రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ అనేకమంది స్థానిక సంస్థల ప్రతినిధులు ,సర్పంచులు పొంగులేటి వెంట నడుస్తున్నారు . పొంగులేటి ప్రభావాన్ని తగ్గించేందుకు ఏ జిల్లాకు లేని ప్రాధాన్యతను కేసీఆర్ ఖమ్మం జిల్లాకు ఇచ్చారు . రెండు రాజ్యసభ సీట్లు ఇవ్వడంతోనే జిల్లా రాజాకీలను మలుపు తిప్పాలని కేసీఆర్ ఆలోచనలకు అద్దం పడుతుంది …కానీ స్థానిక నాయకత్వం దాన్ని అంది పుచ్చుకోవడంలేదనే భావనతో ఉన్న కేసీఆర్ జిల్లాపై ప్రత్యేక ద్రుష్టి సారించారని సమాచారం ..

పొంగులేటి వల్ల నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన్ను ఒంటరి చేసే వ్యూహాలకు పదును పెట్టాలని సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా బీఆర్ యస్ నేతలను ఆదేశించినట్లున్నారు .అందుకే ఎడముఖం పెడముఖంగా ఉండేవారంతా ఏకం అయ్యారు . ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ యస్ అధ్యక్షుడు తాతా మధు అధ్యక్షతన సమావేశమైయ్యారు . 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు .గత నెలలో సీఎం ఉమ్మడి జిల్లాలో చేసిన పర్యటన ,ఇచ్చిన వాగ్దానాలు , అమలు జరుగుతున్నప్రభుత్వ పథకాలు గురుంచి చర్చించామని చెపుతున్నారు . వారు పైకి ఏమి చెపుతున్న జిల్లాలో బీఆర్ యస్ పార్టీ పరిస్థితి, పొంగులేటి వల్ల పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ కంట్రోల్ గురించి చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం …

ఈసమావేశంలో జిల్లాలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కలిసి కట్టుగా కదన రంగంలోకి దుకాలని జిల్లా అగ్రనేతలు నిర్ణయంచుకున్నారు . దీనిపై వారు మేధోమధనం చేశారు . సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, రాములు నాయక్, హరిప్రియ నాయక్ జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ లు పాల్గొన్నారు. వివిధ కారణాలరీత్యా ఎంపీ బండి పార్థసారథి రెడ్డి , మరికొంతమంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కాలేదు ..తిరిగి ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు ముఖ్యనేతలతో త్వరలో సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు …చూద్దాం ఏమి జరుగుతుందో …

Related posts

ఈ నెల 21 న ఖమ్మం నేతలతో షర్మిల సమావేశం

Drukpadam

శ్రీనివాస్ గౌడ్ పై సొంతపార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫైర్

Drukpadam

మాజీ ఎమ్మెల్యేపై వేటు వేసిన జగన్!

Drukpadam

Leave a Comment