Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కన్నా అనుకున్నట్లే కండువా కప్పుకున్నారు …

టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ… కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు!

  • టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
  • ఆయనతో పాటు మరో 3 వేల మంది కూడా టీడీపీలో చేరిక
  • సందడిగా మారిన టీడీపీ కార్యాలయం

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అనుకున్నట్లుగానే టీడీపీ కండువా కప్పుకున్నారు . మొదటి నుంచి ఆయన అధికార వైసీపీకి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించిన కన్నా చంద్రబాబుకు దగ్గరైయ్యారు . రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ అయితే తన రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరం అని భావించిన కన్నా చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు ..టీడీపీ లో కన్నా ఇమడ గలరా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది …

ఏపీ రాజకీయాల్లో ఈరోజు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమయింది. సీనియర్ రాజకీయవేత్త, కాపు సామాజికవర్గంలో బలమైన నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన కుమారుడు, గుంటూరు మాజీ మేయర్ నాగరాజు కూడా టీడీపీలో చేరారు. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు 3 వేల మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. అంతకు ముందు గుంటూరులోని తన నివాసం నుంచి కన్నా లక్ష్మీనారాయణ భారీ వాహన ర్యాలీతో పార్టీ ఆఫీసుకు వచ్చారు.

రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహారం నచ్చక కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు కన్నా చేరికతో టీడీపీ మరింత బలపడుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రస్తుతం కన్నాతో పాటు వచ్చిన నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పార్టీ కండువాలు కప్పుతూ, ఆహ్వానిస్తున్నారు.

Related posts

తిరుపతి వైసీపీ గెలిచింది … సత్తా చాటలేదు…

Drukpadam

మునుగోడులో పోటీ చేయాలా..? వద్దా…?? టీడీపీ మేధోమధనం…

Drukpadam

నెహ్రు పై కేంద్ర మంత్రి రిజుజి ఆరోపణలు …

Drukpadam

Leave a Comment