Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

మహిళల టీ20 వరల్డ్ కప్… పోరాడి ఓడిన టీమిండియా..

మహిళల టీ20 వరల్డ్ కప్… పోరాడి ఓడిన టీమిండియా..

  • టీమిండియా, ఆసీస్ మధ్య సెమీస్ పోరు
  • మొదట 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసిన ఆసీస్
  • లక్ష్యఛేదనలో 8 వికెట్లకు 167 పరుగులు చేసిన భారత్
  • అర్ధసెంచరీ చేసిన కెప్టెన్ హర్మన్ ప్రీత్
  • ఫైనల్లో ప్రవేశించిన ఆస్ట్రేలియా

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం ముగిసింది. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ లో భారత అమ్మాయిలు 5 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు.

173 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్ 43 పరుగులు చేసింది. వీరిద్దరూ అవుటైన తర్వాత దీప్తి శర్మ (20 నాటౌట్) పోరాడినా చివర్లో రన్ రేట్ పెరిగిపోయింది.

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో భారత్ గెలవాలంటే 16 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్ 10 పరుగులు మాత్రమే చేసింది.

ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డనర్ 2, డార్సీ బ్రౌన్ 2, మేగాన్ షట్ 1, జెస్ జొనాస్సెన్ 1 వికెట్ తీశారు. కాగా, ఈ విజయంతో ఆసీస్ మహిళల టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరింది.

Related posts

ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్: టీమిండియా ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచిన పాకిస్థాన్

Ram Narayana

టి 20 వరల్డ్ కప్ ఫైనల్ లో పాకిస్తాన్ …

Drukpadam

సురేశ్ రైనాను తీసుకోకపోవడంపై వివరణ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్!

Drukpadam

Leave a Comment