ఆంధ్రప్రదేశ్

బాలుడిపై కుక్కల దాడి ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా…

బాలుడిపై కుక్కల దాడి ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు
-విచారణ వాయిదా…
-కుక్కల దాడిలో తీవ్ర గాయాలతో బాలుడి మృతి
-మీడియా కథనాల ఆధారంగా విచారణకు తీసుకుంటున్నట్టు హైకోర్టు వెల్లడి
-జీహెచ్ఎంసీ ఏంచేస్తోందని ప్రశ్నించిన న్యాయస్థానం

హైదరాబాదు నగరంలో కొన్నిరోజుల కిందట వీధి కుక్కలు ఐదేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేయడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. కాగా ఈ ఘటనను తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మీడియా కథనాల ఆధారంగా విచారణకు తీసుకుంటున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. వీధి కుక్కల అంశంలో జీహెచ్ఎంసీ ఏంచేస్తోందని ప్రశ్నించింది.

ఈ ఉదంతంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని అభిప్రాయపడింది. వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ సీఎస్, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, అంబర్ పేట మున్సిపల్ అధికారికి నోటీసులు జారీ చేసింది. బాలుడి మృతి బాధాకరమని, నష్ట పరిహారం అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. దీనిపై ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది . అయితే కేసు విచారణను వాయిదా వేశారు . దీనిపై ప్రభుత్వం సమగ్రమైన నివేదికతో రావాలని కోర్ట్ అభిప్రాయపడినట్లు సమాచారం …

Related posts

మన దేశం అప్పు రూ.1,35,86,975 కోట్లు.. 1950లో ఎంతుండేదో తెలుసా?

Drukpadam

The Internet’s Going Crazy Over This £3.30 Mascara

Drukpadam

టర్కీ, సిరియాలలో 15 వేలు దాటిన మరణాలు!

Drukpadam