Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మార్చి 2న తారకరత్న పెద్ద కర్మ.. కార్డుపై బాలకృష్ణ, విజయసాయిరెడ్డిల పేర్లు

మార్చి 2న తారకరత్న పెద్ద కర్మ.. కార్డుపై బాలకృష్ణ, విజయసాయిరెడ్డిల పేర్లు

  • ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పెద్ద కర్మ
  • వెల్ విషర్లుగా బాలయ్య, విజయసాయి పేర్లు
  • మరోసారి కలవనున్న బాలయ్య, విజయసాయి

సినీ నటుడు తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమం మార్చి 2వ తేదీన జరగనుంది. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన కార్డును కుటుంబ సభ్యులు ప్రింట్ చేయించారు. కార్డుపై వెల్ విషర్స్ గా బాలకృష్ణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్లను వేశారు.

తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటి నుంచి ఆయన అంత్యక్రియలు ముగిసేంత వరకు బాలయ్య అన్నీ తానై చూసుకున్నారు. విజయసాయిరెడ్డి తారకరత్న భార్య బంధువు అనే సంగతి తెలిసిందే. దీంతో, ఆయన కూడా రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పెద్దరికాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, ఇతర కుటుంబసభ్యులతో ఒక బంధువులా కలిసి పోయారు. విజయసాయి వ్యవహరించిన తీరును చాలా మంది హర్షించారు. ఇప్పుడు మరోసారి తారకరత్న పెద్ద కర్మ సందర్భంగా బాలయ్య, విజయసాయి కలవబోతున్నారు.

Related posts

నా భార్య చచ్చిపోతోంది…. దయచేసి ఆసుపత్రిలో చేర్చుకోండి’ …భర్త ఆవేదనా పూరిత అభ్యర్ధన

Drukpadam

పుణే బీజేపీ ఎంపీ కన్నుమూత… విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ!

Drukpadam

బీహార్ తెలియకుండానే బ్యాంకు ఖాతాల్లోకి కోట్ల రూపాయలు !

Drukpadam

Leave a Comment