Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాయపూర్ ప్లీనరీలో కాంగ్రెస్ ఐక్యత సందేశం …

కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయా …?
తిరిగి అధికారంలోకి వచ్చే శక్తి కూడగట్టుకుంటుందా …?
బీజేపీ దూకుడును కట్టడి చేయగలుగుతుందా …?
అదానీ వ్యవహారంను కాంగ్రెస్ కలిసొస్తుందా …?
బీజేపీ వ్యతిరేక శక్తులను కూడా గట్టడం సాధ్యమేనా ….?

 

2024 ఏప్రిల్ , మే నెలలో పార్లమెంట్ కు ఎన్నికలు జరగనున్నాయి…
అందుకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి . కాంగ్రెస్ పని అయిపోయిందని , ఇక ఆపార్టీ అధికారంలోకి రావడం జరిగేపని కాదని ప్రత్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నవేళ కాంగ్రెస్ కదలికలను దేశం ఆసక్తిగా గమనిస్తుంది . ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ రాయపూర్ ప్లీనరీ ప్రతిపక్షాల ఐక్యత కోసం చేసిన తీర్మానం ఆశలు రేకెత్తిస్తుంది …

 ప్రతిపక్షాలను కూడా గట్టే పార్టీలు లేవని అందువల్ల బీజేపీ హవా కు తిరుగులేదని ప్రచారం జరుగుతున్న వేళ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి సానుకూల మైలేజీని కల్పించింది . కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన ఈయాత్ర కాంగ్రెస్ అనుకున్నదానికంటే ఎక్కువగా సక్సెస్ అయిందని పార్టీ అభిప్రాయపడుతోంది. ఈ యాత్ర సందేశం దేశవ్యాపితంగా మారుమోగింది . దేశాన్ని మతం ,ప్రాంతం పేరుతోముక్కలు చేయవద్దు ,కులాల మధ్య చిచ్చు పెట్టవద్దని రాహుల్ ఇచ్చిన సందేశం ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించింది . సైలంట్ గా పాజిటివ్ దృక్పధం తో జరిగిన ఈయాత్ర తో పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని అభిప్రాయాలు కలుగుతున్నాయి. బీజేపీకి అదానీ లాంటి మరకలు రెండు టర్మ్ ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదనే అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ శక్తిని కూడా గట్టుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు ..

జోడో యాత్ర జరిగిన ఎన్నికల్లో గుజరాత్ లో అధికారం రాకపోయినా హిల్ స్టేట్ గా భావించే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడం దేశానికి ఒకసందేశం ఇచ్చింది . కాంగ్రెస్ పని అయిపోలేదని చిన్నరాష్ట్రమైన పెద్ద సందేశం ఇచ్చింది . మరి కొద్దీ నెలల్లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలు సెమీఫైనల్ గా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈతరుణంలో జరుగుతున్న రాయపూర్ కాంగ్రెస్ 85 వ ప్లేనరీ లో బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఐక్యకూటమి ఏర్పడాలని పిలుపు నిచ్చారు . థర్డ్ ఫ్రంట్ అంటే అది బీజేపీకే ఉపయోగమని కాంగ్రెస్ ప్లీనరీ అభిప్రాయపడింది .

బీజేపీని ఎదుర్కోవడానికి సెక్యులర్ పార్టీలను కలుపుకుపోవాలి
కాంగ్రెస్ సిద్దాంతాలతో ఏకీభవించే పార్టీలను గుర్తించాలి
దేశానికి కాంగ్రెస్ మాత్రమే సరైన నాయకత్వాన్ని అందించగలదు
అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి …
‘గుర్తించడం, సమీకరించడం, కలిసి పని చేయడం’ ఫార్ములాతో పనిచేయాలి నిర్ణయించింది .

కాంగ్రెస్ సిద్ధాంతాలతో ఏకీభవించే పార్టీలను గుర్తించాలని చెప్పింది. సారూప్య సిద్ధాంతాల ఆధారంగా విపక్ష పార్టీలను తక్షణమే ఏకం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. థర్డ్ ఫ్రంట్ తో బీజేపీకే లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మన దేశానికి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే సరైన నాయకత్వాన్ని అందించగలదని చెప్పింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నేతలు థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తీర్మానం ఆసక్తికరంగా మారింది.

ప్లీనరీ లో స్ఫూర్తి దాయకమైన ప్రియాంక ప్రసంగం ..

లోక్ సభ ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యతపై భారీగా అంచనాలు ఉన్నాయని చెప్పారు. చత్తీస్ గఢ్ లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్ లో ప్రియాంక మాట్లాడారు. భావసారూప్యత గల ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.

ప్రతిపక్షాల ఐక్యతపై ప్రతి ఒక్కరిలోనూ అంచనాలు ఉన్నాయని, తమ పార్టీపైనే మరింత ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సందేశాన్ని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీపై పోరాటం చేసే విషయంలో కార్యకర్తల్లో ధైర్యం ఉందని, దేశం కోసం దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మండల స్థాయి నుంచి కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Related posts

కాంగ్రెస్ లో మారాల్సింది మనుషులు కాదు …వారి మనుసులు…!

Drukpadam

బెంగాల్ లో టీఎంసీ పై మంత్రి శ్రీకాంత్ మహతా అనుచిత వ్యాఖ్యలు…

Drukpadam

బీజేపీపై ఎంఐఎం నేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసి తీవ్ర విమర్శలు …

Drukpadam

Leave a Comment