Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఆర్ యస్ ఎన్నికల వ్యూహం …ఖమ్మం జిల్లా భాద్యతలు ట్రబుల్ షూటర్ హరీష్ రావు కు …

బీఆర్ యస్ ఎన్నికల వ్యూహం …ఖమ్మం జిల్లా భాద్యతలు ట్రబుల్ షూటర్ హరీష్ రావు కు …
-ఉమ్మడి జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ బాస్
-లెఫ్ట్ తో చెలిమికి మొగ్గు …లేకపోతె వాట్ నెక్స్ట్ అనేదిశగా ఆలోచనలు
-నియోజకవర్గాల వారీగా నాయకుల పనితీరుపై హరీష్ రావు ఆరా !
-సమన్వయం దిశగా అడుగులు…సాధ్యమైనంతవరకు అందరికి కలుపుని పోవాలని నాయకులకు ఆదేశాలు
–జిల్లాలో బీఆర్ యస్ జెండా రెపరెపలాడే విధంగా ప్రణాళికలు

బీఆర్ యస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ ఈ ఏడాది చివరిలో జరగనున్న ఎన్నికలకోసం కసరత్తు మొదలు పెట్టారు .గత నాలుగైదు నెలలుగా తన ఎత్తుగడలతో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకోని వచ్చేందుకు పథక రచన చేస్తున్న కేసీఆర్ గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనుకున్న విధంగా సీట్లను పొందలేక పోయారు … ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది సీట్లలో 2014 లో కొత్తగూడెం అసెంబ్లీ , 2018 లో ఖమ్మం అసెంబ్లీ సీట్లను మాత్రమే గెలుపొందారు . పార్టీలోకి ఇతర పార్టీల నుంచి హేమాహేమీలు చేరిన పార్టీ ఎదుగుదల లేకపోవడం , సీట్లు రాకపోవడం పై గులాబీ పార్టీ ఆందోళనగా ఉంది . జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టినా, ప్రజల మద్దతు కూడ గట్టలేకపోవడం పై అసహనంతో ఉన్నారు .ఎన్ని నిధులు ఇచ్చి పనులు చేసినా, ఫలితం లేకపోవడం, ప్రత్యేకించి గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ,జలగం వెంకట్రావు , లాంటి వారు ఓడిపోవడం సీఎం కేసీఆర్ సైతం ఖంగు తినిపించింది . మధిర సీట్లో తాను అనుకున్న అభ్యర్థి లింగాల కమల్ రాజ్ కు టికెట్ ఇప్పించుకున్న మాజీ ఎంపీ పొంగులేటి దాన్ని గెలిపించకపోగా , వైరాలో ,బానోత్ మదన్ లాల్ , పాలేరు లో తుమ్మల ఓటమిలోతనవంతు పాత్ర నిర్వహించారని అపవాదును మూటగట్టుకున్నారు .అయితే పొంగులేటి మనుషులుగా ముద్రపడిన పాయం వెంకటేశ్వర్లు , తాటి వెంకటేశ్వర్లు , తెల్లం వెంకట్రావు ,చివరకు పొంగులేటి ఇంచార్జ్ గా ఉన్న మధిరలో లింగాల కమల్ రాజ్ ఓటమిలో పాత్ర ఎవరిదీ అనేది పార్టీ కనీసం సమీక్షా చేసిందో లేదో అర్థం కానీ మిస్టరీ గా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి .దీన్ని పక్కన పెడితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకర్గాల్లో బీఆర్ యస్ పార్టీలో ఉన్న కొంతమంది పొంగులేటి జై కొడుతున్నారు.

దీనిపై సీరియస్ గా ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ ఖమ్మం పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు . ఈసారి ఖమ్మం జిల్లాలో మెజార్టీ సీట్లు పొందాలని టార్గెట్ గా పెట్టుకున్నారు . అందుకు బీఆర్ యస్ కీలక నేత ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు కు భాద్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం …

పార్టీకి పొంగులేటి దూరం కావడమే కాకుండా ,తన వెంట కొంతమంది బీఆర్ యస్ ముఖ్యనేతలను తీసుకోని పోవడంపై గులాబీ బాస్ సీరియస్ గా ఉన్నారు .ఈవిషయంలో జిల్లా నాయకత్వం వైఫల్యం చెందినదని ఆగ్రహంగా ఉన్న కేసీఆర్ , పార్టీకి జిల్లాలో జరుగుతున్న నష్టం పై ఇంటలిజెన్స్ నివేదికలు తెప్పించుకున్నారు .

జనవరి 18 ఖమ్మం లో జరిగిన బీఆర్ యస్ తోలి బహిరంగ సభ జరిగింది . ఆసభకు మంత్రి హరీష్ రావు ను ఇంచార్జి గా నియమించడం ఆయన జిల్లాలో వారం రోజులు పైగా మకాం వేశారు . ఈసందర్భంగా ఇక్కడ నేతల పనితీరు దగ్గరుండి గమనించారు . అలకబూనిన కొందరు నేతలను స్వయంగా కలిసి బహిరంగ సభ జయప్రదంలో భాగస్వాములను చేశారు .

జిల్లా రాజకీయ నేతలపై ఒక అవగాహనకు వచ్చిన హరీష్ రావు అందరిని ఒకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు .అందులో భాగంగానే ఎన్నడూ లేనిది జిల్లాలోని బీఆర్ యస్ ముఖ్యనేతలు ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో రహస్య సమావేశం నిర్వహించారు . ఇందులో జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చించారు . పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయాలనీ నిర్ణయించారు . పార్టీని డ్యామేజ్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఒక అవగాహనకు వచ్చిన నేతలు అందుకు అనుగుణంగా కార్యాచరణలోకి దిగాలని నిర్ణయించుకున్నారు .

Related posts

పీఎం మోడీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ …!

Drukpadam

ఇక్కడి రైతులను ఆదుకోని కమీషన్ రావు దేశాన్ని ఉద్ధరిస్తాడట: షర్మిల

Drukpadam

భారతీయుల డీ ఎన్ ఏ ఒక్కటే: మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment