Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మెడికో ప్రీతి వేదింపులు విషయంలో జూనియర్ డాక్టర్ల వైఖరి జుగుస్సాకరం ….

మెడికో ప్రీతి వేదింపులు విషయంలో జూనియర్ డాక్టర్ల వైఖరి జుగుస్సాకరం ….
-ప్రీతిని సైఫ్ వేదించలేదని మొండిగా వాదించిన కొందరు
-అయినా తెలియని విషయాలు జూనియర్లకు గట్టిగానే చెపుతారని బుకాయింపు…
-సైఫ్ కు అనుకూలంగా ఆందోళనలు
-వరంగల్ సీపీ రంగనాథ్ సైఫ్, ప్రీతిని వేధించారని నిర్దారణ
-తమ విచారణలో వెల్లడైందని స్పష్టం
-ప్రీతిదే తప్పు అన్నట్లుగా జూనియర్ల ప్రవర్తన
-తర్వాత కూడా నల్లబ్యాడ్జిలతో విధులకు హాజరు..

ఒక విద్య కుసుమం వేదింపులకు బలైంది …మరో వ్యక్తి ఈ వేధింపులు చేసి జైలు పాలైయ్యాడు … ఇద్దరు ఉన్నత విద్యావంతులు …. తమ ప్రవర్తనతో సమాజానికి ప్రధానంగా ప్రజలకు సేవలు అందించాల్సినవారు …ఈ సంఘటన అత్యంత బాధాకరం … ఎవరది తప్పు …? ఎవరిదీ ఒప్పు అనే విషయం పక్కన పెడితే ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాల్సింది . అది అందరు కోరుకుంటుంది . కానీ దీనిపై వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు పాత్ర అత్యంత అమానవీయకరంగా జుగుస్సాకరంగా ఉంది . జూనియర్ డాక్టర్ సైఫ్ , పీజీ విద్యార్ధి ప్రీతి మధ్య ఏమిజరిగింది అనేదానిపై రకరకాల వాదనలు ఉన్నాయి.జూనియర్ డాక్టర్ల పీజీ విద్యార్థులకు గైడ్ గా ఉంటారు . పేషేంట్ల నుంచి వారు నేర్చుకోవాల్సింది చేలా ఉంటుంది .ఇది ఒక ప్రాక్టికల్ కోర్స్ …ఆలా చేస్తుంటారు .అయితే జూనియర్ డాక్టర్ అయిన సైఫ్ ,ప్రీతికి చెప్పే విషయంలో గట్టిగ చెప్పారని , అంతేకాని ఆమెను వేధింపులకు గురిచేయలేదని జూనియర్లు ఆయన తరుపున గట్టిగ వాదనలు వినిపించారు . ఒకపక్క ఆమె సైఫ్ వేధింపులవల్ల ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్న అసలు విషయాలు తెలుసుకుందుకు ప్రయత్నించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం పై ప్రజాసంఘాలు , రాజకీయపార్టీలు భగ్గుమంటున్నాయి. జూనియర్లు సైఫ్ కు అనుకూలంగా ఆందోళనలు చేపట్టడం , చివరకు వరంగల్ సిపి రంగనాథ్ తమ విచారణలో సైఫ్ ,ప్రీతిని వేధించినట్లు నిర్దారణ అయిందని చెప్పినప్పిన తర్వాత కొంత వెనక్కు తగ్గినా సైఫ్ ను వెనక వేసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నం పై జుడాలపట్ల వేవగింపుల వ్యక్తం అవుతున్నాయి. చావుబతుకుల మధ్య ఉన్న ప్రీతిపై కనీసం దయ,జాలి చూపకపోవడం పై విద్యావంతులైన జూడాలు ఆలోచించుకోవాలి …దీనిపై మధనం జరగాలి …సమాజ గమనంలో వారి పాత్ర రాంగ్ ట్రాక్ పట్టకుండా రైట్ ట్రాక్ లో ఉండాలని కోరు కుందాం….

Related posts

కెనడాలో కాల్పులకు భారత విద్యార్థి బలి…

Drukpadam

రైళ్లపై రాళ్లదాడులు.. ఐదేళ్ల శిక్ష తప్పదని రైల్వే హెచ్చరిక!

Drukpadam

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిని కత్తిపీఠతో నరికి చంపిన యువతి …

Drukpadam

Leave a Comment