Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నిత్యానంద కైలాస దేశానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు …

నిత్యానంద కైలాస దేశం అధికారికమేఐరాసలో ప్రతినిధులు ప్రత్యక్షం!

  • అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద
  • దేశం విడిచి పారిపోయిన వైనం
  • కైలాస దేశం స్థాపించానంటూ అప్పట్లో ప్రకటన
  • తాజాగా ఐరాసలో కైలాస దేశ ప్రతినిధి ప్రసంగం

భారత్ లో అత్యాచార ఆరోపణలు రాగానే విదేశాలకు పారిపోయిన స్వామి నిత్యానంద తానొక దేశాన్ని ఏర్పాటు చేశానంటే అప్పట్లో అందరూ నవ్వుకున్నారు. తన దేశానికి ‘కైలాస’ అని పేరుపెట్టానని చెబితే అంతా వట్టిదేనంటూ కొట్టిపారేశారు. తన దేశానికి జెండా ఉందని, రిజర్వ్ బ్యాంకు ఉందని, సొంత కరెన్సీ, పాస్ పోర్టు కూడా తీసుకువచ్చామని చెబితే, అదొక రకమైన ప్రచారం అంటూ తేలిగ్గా తీసిపారేశారు.

కానీ, తాజా పరిణామాన్ని బట్టి కైలాస దేశం ఉత్తుత్తి దేశం కాదని, నిత్యానంద నిజంగానే ఓ దేశానికి అధినేత అని నిర్ధారణ అయింది. ఐక్యరాజ్యసమితిలో కైలాస దేశం తరఫున ఓ ప్రతినిధి ప్రసంగించడమే అందుకు నిదర్శనం. జెనీవాలో ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశం జరగ్గా… కైలాస దేశం తరఫున విజయప్రియ నిత్యానంద, ఈఎన్ కుమార్ ప్రతినిధులుగా హాజరయ్యారు.

విజయప్రియ నిత్యానంద తనను తాను ఐక్యరాజ్యసమితిలో కైలాస దేశ శాశ్వత ప్రతినిధిగా పరిచయం చేసుకున్నారు. ఆ మేరకు ప్రసంగం కూడా చేశారు. మొదట కైలాస దేశ విశిష్టతను వివరించారు. కైలాస దేశం హిందువుల కోసమే ఏర్పడిన మొట్టమొదటి సార్వభౌమ దేశం అని పేర్కొన్నారు. తమ దేశాధినేత పేరు నిత్యానంద పరమశివం అని వెల్లడించారు. నిత్యానంద పరమశివం పరమావధి హిందూ మత పునరుజ్జీవం అని స్పష్టం చేశారు.

అయితే, తమ దేశాధినేత నిత్యానందను భారత్ వేధిస్తోందని ఐరాస వేదికగా విజయప్రియ ఆరోపించారు. ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు.

Related posts

పాలేరు ఓటమిపై రగిలి పోతున్న తుమ్మల …

Drukpadam

గుజరాత్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే …ఆపేరు మార్పు ఖాయం …!

Drukpadam

నిజంగానే అంత పలుకుబడి నాకుంటే నేనెందుకు ఓడిపోతానయ్యా!: చంద్రబాబు!

Drukpadam

Leave a Comment