Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సిలిండర్ ధర పెంపుపై భగ్గుమన్న బీఆర్ యస్.. నిరసనలకు పిలుపు ..

సిలిండర్ ధర పెంపుపై భగ్గుమన్న బీఆర్ యస్.. నిరసనలకు పిలుపు ..
-ఖమ్మం జిల్లా వ్యాపితంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్న జిల్లా అధ్యక్షుడు తాతా మధు…
-మోడీ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ఉద్యమాలు
-2014 ముందు రూ 400 ఉన్న ధర నేడు 1200 చేరిందని మండిపాటు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గృహ అవసరాల సిలిండర్ మరియు కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా పెంచటాన్ని తీవ్రంగా వ్యతరేకించండి 2014 లో మోడీ ప్రభుత్వం రాకముందు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈరోజు 1160ని దాటి 1200లకు చేరుకుందని మధు అన్నారు .పెరుగుతున్న సిలిండర్ ధరలపైన ప్రజలకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు … పెరుగుతున్న సిలిండర్ ధరలు, నిత్యవసర సరుకుల పెరుగుదల వలన ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వెంటనే పెంచిన సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేయడంపై మండిపడ్డారు .

ప్రజల కష్టాలు, కడగండ్ల పాలు చేస్తున్న మోడీ పాలన పై, బీజేపీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఎల్లుండి ఈనెల 3 న రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలని బీఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపును జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు మధు తెలిపారు .కేంద్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ధరలను దుర్మార్గంగా పెంచుతున్న తీరును మీడియా ద్వారా ప్రజలకు చేరేలా చూడాలని జిల్లా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు .

ఒకవైపు ఉజ్వల స్కీం పేరుతో మాయమాటలు చెప్పిన బిజెపి ప్రభుత్వం ఈరోజు భారీగా సిలిండర్ ధరలను పెంచుతున్నది. పేదవారిని సిలిండర్ గ్యాస్ కు దూరం చేస్తున్నది. ఉజ్వల స్కీం లో ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా లబ్ధి పొందిన మొదటి మహిళా సైతం ఈరోజు సిలిండర్ను కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నది.

కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాపితంగా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  పిలుపును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు .

Related posts

బిజెపిలో చేరికలు ప్రోత్సహిస్తాం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి!

Drukpadam

తెలుగు రాష్ట్రాల నుంచి 6 గురు రాజ్యసభకు ఏకగ్రీవమే ….!

Drukpadam

దేహదారుఢ్యం కోసమే రాహుల్ పాదయాత్ర: కేటీఆర్

Drukpadam

Leave a Comment