Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తుమ్మలకు ఎమ్మెల్సీ అంటూ వస్తున్న వార్తలు ..ఏది నిజం …ఏది అబద్దం!

 తుమ్మలకు ఎమ్మెల్సీ అంటూ వస్తున్న వార్తలు ..ఏది నిజం …ఏది అబద్దం!
-తుమ్మలకు ఎమ్మెల్సీ అంటూ మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్
-దీనిపై రాజకీయ పక్షాల ఆరా …
-ఆయన్ను 3 సాయంత్రానికల్లా హైద్రాబాద్ రావాలని కోరినట్లు పుకార్లు
-మంత్రివర్గంలో స్థానమంటూ ప్రచారం
-ఇటివల ఆయన ఇరిగేషన్ అధికారులతో జరిపిన సమీక్ష
-పైనుంచి వచ్చిన ఆదేశాలమేరకు సమీక్ష జరిపారని అంటున్న మద్దతు దార్లు ..
-లేదు ఆయన అసెంబ్లీ కే పోటీచేస్తారని అంటున్న అనుయాయులు

పాపం తుమ్మల సీనియర్ రాజకీయ నాయకులు ఒకప్పుడు తన కనుసైగలతో జిల్లాను శాసించిన నేత …ఇప్పుడు తనకు సీటుకోసం నానాతంటాలు పడుతున్నారు . తెలంగాణ అసెంబ్లీ లో ఎమ్మెల్యే కోట నుంచి మూడు అసెంబ్లీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో మరోసారి ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది . ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తారని అందుకు ఆయన హైద్రాబాద్ వెళుతున్నారని జిల్లాలో ప్రచారం … ఇది నిజమేనా …? లేదా అని ప్రచార మాధ్యమాలు ఎవరు పాత్ర వారు ప్రోత్సహిస్తున్నారు .. అయితే ఏది నిజం ..ఏది అబద్దం నిజంగా ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నారా..? ఆయన్ను నిజంగా 3 తేదీ సాయంత్రానికి హైద్రాబాద్ లో అందుబాటులో ఉండమని చెప్పారా …? అసలు ఏమిజరుగుతుంది అనే ఆసక్తి ఖమ్మం జిల్లా రాజకీయవర్గాల్లో నెలకొన్నది . కొంతకాలం క్రితం వరకు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న తుమ్మల జనవరి 18 న ఖమ్మంలో జరిగిన బీఆర్ యస్ బహిరంగ సభలో ఉత్సాహంగా పాల్గొన్నారు . సభకు ముందు వరకు ఆయన బీఆర్ యస్ లో ఉంటారా ? లేక పార్టీ మారతారా …? అనే ప్రచారం కూడా జరిగింది. తాను తిరిగి పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని తన అనుయాయులకు భరోసా ఇస్తూ వస్తున్నారు . దానికి తగ్గట్లుగానే నియోజకవర్గంలో పర్యటనలు జరపడం చేస్తున్నారు . జనవరి 1 వ తేదీన ఖమ్మం రురల్ మండలం లోని శ్రీ సిటీ లో హాట్టహాసంగా నూతన గృహప్రవేశం చేశారు .దానికి భారీ సంఖ్యలో తన అభిమానులు తరలి వచ్చారు . తుమ్మలకు గులాబీ పార్టీ పాలేరు టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారతారనే సంకేతాలు కూడా వెలువడ్డాయి. ఒక సందర్భంలో తుమ్మల హడావుడిపై గులాబీ బాస్ కూడా ఆరా తీశారు . జిల్లాలో ఒకపక్క పొంగులేటి పార్టీకి దూరం అవుతున్న నేపథ్యంలో తుమ్మల కూడా దూరం అయితే పార్టీకి ఇబ్బందులు తప్పవని అనుకున్న గులాబీ బాస్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు . ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ యస్ సభ సందర్భంగా జిల్లా ఇంచార్జి గా వచ్చిన మంత్రి హరీష్ రావు ను గండుగులపల్లిలోని తుమ్మల నివాసానికి పంపించి తిరిగి పార్టీలో యాక్టీవ్ అయ్యేలా చేశారు . దీంతో తుమ్మలకు మంచి రోజులు వచ్చాయని పాలేరు సీటు ఖాయమనే ప్రచారం మొదలైంది .అంతే కాకుండా ఆయనకు మంత్రివర్గంలో కూడా స్థానం దక్కే అవకాశం ఉండనే పుకార్లు షికార్లు చేశాయి. దానికి తగ్గట్లుగానే తుమ్మల కొద్దీ రోజుల క్రితం ఇరిగేషన్ శాఖకు చెందిన ఉన్నతాధికారులను తన ఇంటికి పిలిపించుకొని సీతారామ ప్రాజక్టు పై చర్చలు జరిపారు . అదికూడా ఆదివారం రోజున అధికారులు వెళ్లి ఆయన దగ్గర జరిగిన సమీక్షలో పాల్గొనడంతో బీఆర్ యస్ పార్టీలో అలజడికి కారణమైంది . అయితే తుమ్మలకు పైనుంచి వచ్చిన ఆదేశాలమేరకే అధికారులు ఆయన ఇంటికి సమీక్ష నిమిత్తం వచ్చారని అంటున్నారు .చివరకు ఉన్నతాధికారులతో ,ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో కూడా తుమ్మల ఫోన్ లో మాట్లాడిన విషయాలను ప్రస్తావిస్తూ ఆయన పరపతి పెరిగిందని అనుయాయులు సంబర పడుతున్నారు . సీటు విషయంలో ఆయన ఏది కోరుకుంటే ఆసీటు అది ఎమ్మెల్యే నా …? లేదా ఎమ్మెల్సీ నా …? అనేది తేల్చుకోవాల్సింది ఆయనేనని ప్రచారం జరుగుతుంది . దీంతో తుమ్మలకు మంచి రోజులు రానున్నాయని కొందరు అంటున్నారు . అయితే మరికొందరు మాత్రం దీనికి ఇరుద్దంగా మాట్లాడుతున్నారు . తుమ్మలకు ఎమ్మెల్సీ అవకాశం లేదని సామాజికవర్గాల పొందిక ప్రకారం ఎమ్మెల్సీ కోటా నుంచి రిటైర్ అవుతున్న ముగ్గురు ఎమ్మెల్సీలతో ఒకరు బీసీ ఉండగా మరొకరు రెడ్డి సామాజికవర్గం మరొకరు క్రిస్టియన్ ఉన్నారని అందువల్ల తుమ్మలకు ఛాన్స్ ఉండకపోవచ్చునని ఒక సీనియర్ నేత అన్నారు . అయితే ఎమ్మెల్సీల ఎంపికలో ఎవరి పైరవీలు ఉండవని గులాబీ బాస్ సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు . ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందినవారు ఎమ్మెల్సీ ఉండగా మరొక కమ్మ సామాజికవర్గానికి ఎమ్మెల్సీ ఇస్తారని తాను అనుకోవడం లేదని పేరు వెల్లడించడానికి ఇష్టం లేని మరొక నేత అన్నారు . అదే విధంగా మంత్రివర్గంలో తుమ్మలకు ఛాన్స్ లేకపోవచ్చునని అంటున్నారు . ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ కమ్మ సామాజికవర్గం నుంచి ఉండగా మరొకరికి ఎలా ఇస్తారని అంటున్నారు

మరో ప్రచారం ఏమిటంటే తుమ్మలే ఎమ్మెల్సీ తీసుకునేందుకు ఇష్టపడటంలేదని , ఆయన పాలేరు లోనే పోటీ చేస్తారని ఆయన మద్దతు దార్లు అంటున్నారు . దీంతో ఏది నిజం …? ఏది అబద్దం అనేది తేల్చుకోలేక పోతున్నారు ప్రజలు ….!

Related posts

అర్హుల పొట్ట కొట్టు.. బందిపోట్లకు పెట్టు: వైఎస్ షర్మిల ఆగ్రహం…

Drukpadam

బజరంగ్‌ దళ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు…

Drukpadam

రాజన్న బిడ్డ మీ ముందుకు వచ్చింది… మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి: వైఎస్ విజయమ్మ

Drukpadam

Leave a Comment