Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పెళ్లి కార్డులు పంచేందుకు హెలికాఫ్టర్ అద్దెకు …

హెలికాప్టర్ లో వెళ్లి పెళ్లికార్డులు పంచిన హైదరాబాద్ వ్యాపారవేత్త!

  • తమ్ముడిపై ప్రేమను ఘనంగా చాటుకున్న మధు యాదవ్
  • మధు యాదవ్ సోదరుడి పెళ్లికి ముహూర్తం 
  • ముంబయిలో బంధువులకు కార్డులు ఇచ్చేందుకు హెలికాప్టర్ లో పయనం

హైద్రాబాద్ కు చెందిన ఒక వ్యాపారవేత్త తన తమ్ముడి పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు .అందులో భాగంగా బందు మిత్రులను భారీగా పిలుస్తున్నారు .ముంబై లో ఉన్న వారి బంధువులను ఆహ్వానించేందుకు ఏకంగా హెలికాఫ్టర్ ను అద్దెకు తీసుకున్నారు . హైద్రాబాద్ నుంచు ముంబై వెళ్లి అక్కడ ఉన్న బంధులందరికి కార్డులు అందజేశారు . తన బంధువు తన సొంతతమ్ముడి పెళ్లికోసం నేరుగా హెలికాఫ్టర్ పై వచ్చి కార్డులు పంచడం చూసి బంధువులు ఆశ్చర్యపోయారు .

హైదరాబాద్ బిజినెస్ మేన్ మధు యాదవ్ తన సోదరుడి పెళ్లి కార్డులు ఇచ్చేందుకు హెలికాప్టర్ లో వెళ్లి మీడియా దృష్టిని ఆకర్షించారు. త్వరలో మధు యాదవ్ తమ్ముడి వివాహం జరగనుంది. మధు యాదవ్ కుటుంబానికి ముంబయిలో బంధువులు ఉన్నారు. అక్కడే కొందరు మిత్రులు కూడా ఉన్నారు. 

దాంతో వారికి శుభలేఖలు ఇచ్చేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాదు నుంచి ముంబయి వెళ్లారు. అక్కడ బంధుమిత్రులందరికీ పెళ్లి కార్డులు ఇచ్చి ఆహ్వానించారు. ఈ విధంగా తన తమ్ముడిపై ఉన్న ప్రేమాభిమానాలను మధు యాదవ్ ఘనంగా చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Related posts

దేశంలో 22 నకిలీ యూనివర్సిటీలు.. గుంటూరులో ఒకటి, విశాఖలో మరోటి: ప్రకటించిన యూజీసీ…

Drukpadam

క్షీణించిన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం.. ఎయిమ్స్ కు త‌ర‌లింపు

Drukpadam

సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ విజేత పల్లా రాజేశ్వర్ రెడ్డి

Drukpadam

Leave a Comment