Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

టీఎన్నార్ కుటుంబానికి సంపూర్ణేశ్ బాబు సహాయం రూ.50 వేలు!

టీఎన్నార్ కుటుంబానికి సంపూర్ణేశ్ బాబు సహాయం రూ.50 వేలు!
కరోనాతో మృతి చెందిన సినీ జర్నలిస్టు టీఎన్నార్
టీఎన్నార్ భార్య జ్యోతి ఖాతాలో నగదు జమ చేసిన సంపూ
టీఎన్నార్ తో తనకు మేలు జరిగిందని వెల్లడి
ఆయన కుటుంబానికి అండగా నిలుస్తానని హామీ
ఇతరులు కూడా సాయం చేయాలని విజ్ఞప్తి
ప్రముఖ సినీ పాత్రికేయుడు టీఎన్నార్ కరోనా మహమ్మారికి బలైన నేపథ్యంలో ఆయన కుటుంబానికి నటుడు సంపూర్ణేశ్ బాబు ఆర్థికసాయం చేశారు. టీఎన్నార్ అర్ధాంగి జ్యోతి బ్యాంకు ఖాతాలో తాను రూ.50 వేలు జమ చేసినట్టు సంపూర్ణేశ్ బాబు వెల్లడించారు. టీఎన్నార్ ఇంటర్వ్యూ ద్వారా తాను వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఒక మెట్టు పైకెదిగానని వినమ్రంగా తెలిపారు.

ఆయన కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, తనవంతు సాయం తప్పకుండా చేస్తానని సంపూ మాటిచ్చారు. ఇతరులు కూడా టీఎన్నార్ కుటుంబానికి ఆసరాగా నిలవాలని పిలుపునిచ్చారు. తన ట్వీట్ లో టీఎన్నార్ భార్య జ్యోతి బ్యాంకు ఖాతా నెంబరు, తదితర వివరాలను పంచుకున్నారు. అంతకు ముందే మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల తాత్కాలిక సహాయం అందజేశారు. ప్రముఖ నటులకు చిరపరిచితులుగా ఉన్న టీఎన్నార్ మరణం తో సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి లోనైయ్యారు . మోహన్ బాబు టీఎన్నార్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Related posts

270 మంది కొవిడ్ బాధితులను కాపాడిన వైద్యుడు!

Drukpadam

ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌కు క‌రోనా పాజిటివ్‌

Drukpadam

కరోనా డేంజర్ బెల్స్ ఇంకా ఉన్నాయి … జాగ్రత్తలు అవసరం మాస్క్ తప్పనిసరి!

Drukpadam

Leave a Comment