Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వద్దురా నాయన మోడీ పాలన … స్వయంగా మంత్రి హరీష్ రావు నినాదాలు!

వద్దురా నాయన మోడీ పాలనా … స్వయంగా మంత్రి హరీష్ రావు నినాదాలు!
-కోరస్ అందుకున్న కార్యకర్తలు…
-పాల్గొన్న మరో మంత్రి మల్లారెడ్డి …రోడ్ పై బైఠాయించిన మంత్రులు
-డౌన్ ,డౌన్ మోడీ …
-ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం
-గ్యాస్ బండ పై బాదుడు …మహిళల పాలిట శాపం

కేంద్రం లోని మోడీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ లో మంత్రులు తన్నీరు హరీష్ రావు , మల్లారెడ్డి రోడ్ పై బైఠాయించి మోడీ పాలనపై తమ నిరసన గళం వినిపించారు . స్వయంగా హరీష్ రావు రోడ్ పై బైఠాయించి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు …హరీష్ రావు నినాదాలకు కార్యకర్తలు కోరస్ కలిపారు . మోడీ డౌన్ ,డౌన్ , ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అంటూ నినదించారు . దీంతో ఆప్రాంతం నిరసనల హోరుతో మరు మోగింది. 2014 కు ముందు మన్మోహన్ సింగ్ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర కేవలం 450 రూపాయలు ఉండగా 2023 నాటికీ 8 సంవత్సరాలు మోడీ పాలనలో సిలిండర్ ధర 1200 రూపాయలకు చేరుకున్నది హరీష్ రావు మండిపడ్డారు . బీఆర్ యస్ పార్టీ నిరసనలకు పిలుపును అందుకుని జరుగుతున్న ఆందోళనలు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని ధ్వజమెత్తారు . మోడీ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమిలేదని అన్న సరుకుల ధరలు పెరిగాయని , విమర్శలు గుప్పించారు . కులం ,మతం ,ప్రాంతం లాంటి ఉద్యమాలతో ప్రజలను చీల్చి పబ్బం గడుపుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు .

Related posts

వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: బాలకృష్ణ

Drukpadam

తుమ్మల పై మరల ట్రోలింగ్…!

Drukpadam

బెంగాల్‌ ప్రచారపర్వంలోకి జయాబచ్చన్…టీఎంసీ కి మద్దతు

Drukpadam

Leave a Comment