Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ …మోడీ ప్రభుత్వంపై విమర్శలు …

  • భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది … కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
  • -కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ
  • -దేశంలో న్యాయవ్యవస్థ , మీడియా కబ్జాకు గురైంది
    -తనతోపాటు అనేక మంది ప్రతిపక్ష నేతలపై పెగసెస్ స్పైవేర్ ఉపయోగించిందని ఆరోపణలు
  • భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశ ప్రజాస్వామ్య ప్రాథమిక నిర్మాణం దాడికి గురవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సంస్థాగత నిర్మాణం అవసరమని అభిప్రాయపడ్డారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ శుక్రవారం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్ ను ఉపయోగించి తనపై గూఢచర్యం చేసేందుకు చేస్తుందని   ఆయన ఆరోపించారు. 

కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్ స్కూల్ విద్యార్థులకు ‘లెర్నింగ్ టు లిసన్ ఇన్ ది 21వ శతాబ్దం’ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు.‘భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది. మేం ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము’ అని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై గూఢచర్యం చేయడానికి పెగాసస్‌ను ఉపయోగించిందని అన్నారు. 

‘నా ఫోన్‌లో పెగాసస్ స్పైవేర్ చొప్పించారు. చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లలోనూ పెగాసస్ ఉంది. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నాకు చెప్పారు’ అని రాహుల్ అన్నారు. దేశంలో మీడియాను, న్యాయవ్యవస్థను కబ్జా చేసి, నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఇతరులపై నిఘా, బెదిరింపులు, మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులతో ప్రభుత్వంపై అసమ్మతిని అణగదొక్కుతున్నారని విమర్శించారు. కాగా, రాహుల్ గాంధీ యూకేలో వారం రోజుల పాటు పర్యటిస్తారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బిగ్ డేటా, ప్రజాస్వామ్యం, భారతదేశం-చైనా సంబంధాలపై నిపుణులతో నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటారు.

భారత్ జోడో యాత్రలో ఉగ్రవాదులను అతి దగ్గర నుంచి చూశాను: రాహుల్ గాంధీ

కశ్మీర్ లో భయానక పరిస్థితి ఎదురైందని వెల్లడి

సమస్యల్లో చిక్కుకుంటున్నానేమో అనిపించిందని వివరణ

Rahul Gandhi says he was seen terrorists in Jammu Kashmir

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో భాగంగా లండన్ లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. లెర్నింగ్ టు లిజన్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే అంశంపై రాహుల్ గాంధీ ప్రసంగించారు. 

ఈ సందర్భంగా ఆయన ఇటీవల తాను చేపట్టిన భారత్ జోడో పాదయాత్రలోని కొన్ని ముఖ్యమైన అంశాలను వివరించారు. భారత్ జోడో యాత్ర చివరలో జమ్మూ కశ్మీర్ లో పాదయాత్ర చేస్తుండగా, ఉగ్రవాదులను అత్యంత దగ్గర నుంచి చూశానని వెల్లడించారు. పాదయాత్ర జమ్మూ కశ్మీర్ చేరుకోగానే, ఇక ముందుకు వెళ్లొద్దని భద్రతా సిబ్బంది సూచించారని, కానీ పార్టీ వర్గాలతో చర్చించిన తర్వాత పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. 

“ఆ విధంగా పాదయాత్ర చేస్తుండగా ఓ కొత్త వ్యక్తి నా వద్దకు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నేతలు నిజంగానే కశ్మీర్ కు వచ్చి ప్రజల బాధల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ఆ తర్వాత కాస్త అవతల నిలబడి ఉన్న కొందరిని చూపించి వాళ్లంతా టెర్రరిస్టులు అని వెల్లడించాడు. దాంతో నేను సమస్యల్లో చిక్కుకుంటున్నానా అని అనిపించింది. ఆ సమయంలో ఉగ్రవాదులు నన్ను చంపేసేందుకు అవకాశం ఉంది. కానీ వారు అలా చేయలేదు. నా నిబద్ధతను వారు గుర్తించారు. మేం వచ్చింది ప్రజా సమస్యలను వినడానికే అని వారు తెలుసుకున్నారు” అని వివరించారు.

Related posts

మునుగోడు ఎన్నికల వాగ్దానాల అమలుదిశగా టీఆర్ యస్ అడుగులు!

Drukpadam

కాంగ్రెస్ పై మరోసారి నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ!

Drukpadam

స‌హ‌నం కోల్పోయి కార్య‌క‌ర్త‌పై చేయి చేసుకున్న సీనియర్ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు!

Drukpadam

Leave a Comment