Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారా…?

పొంగులేటి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారా…?
-బీజేపీతో లక్ష్యం నెరవేరడం కష్టం అనే అభిప్రాయానికి వచ్చారా …?
-కాంగ్రెస్ అయితే సానుకూలంగా ఉంటుందని సన్నిహితుల సూచన
-ఇప్పటికైతే స్టేటస్కో …ఏ నిర్ణయం తీసుకోలేదంటున్న పొంగులేటి కార్యాలయం…
-ఎప్పటి నుంచో రెండు పార్టీల నుంచి ఆఫర్లు ఉన్నాయని స్పష్టికరణ
-జిల్లాలో కొనసాగుతున్న పొంగులేటి పర్యటనల దూకుడు …

ఇప్పటివరకు జెండా ,ఏపార్టీ లేని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా…? జిల్లా రాజకీయాలను శాసించబోతున్నారా …? ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తే లాంటి ఆలోచనలు చేస్తున్నారా ? దానికోసం తన హితులు ,సన్నిహితులు , సహచరులతో చర్చిస్తున్నారా…? కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారా… ? బీజేపీతో లక్ష్యం నెరవేరదనే నిర్ణయానికి వచ్చారా …? అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు … ఇదే జరిగితే ఖమ్మం జిల్లా రాజకీయ ముఖ చిత్రమే మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . అయితే ఇప్పటివరకు పొంగులేటి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు …ఉమ్మడి జిల్లాలో తన పర్యటనల దూకుడు కొనసాగిస్తున్నారు . కొన్ని నియోజకవర్గాల్లో తన మనుషులను అభ్యర్థులుగా సైతం ప్రకటించారు . పార్టీ ప్రచార కార్యాలయాలు కూడా ప్రారంభిస్తున్నారు . రాజకీయాలలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ తనను నమ్ముకున్న ప్రజలకోసం కొండంత అండగా ఉంటున్నారు … అటు బీజేపీ నా ? ఇటు కాంగ్రెస్ అనే విషయంలో స్టేటస్కో మెయింటెనెన్స్ చేస్తున్నారని కొత్త పార్టీ అనే ఆలోచనేలేదని పొంగులేటి అనుయాయులు కుండబద్దలు కొట్టి చెపుతున్నారు . తమ నాయకుడు ప్రజల్లో ఉన్నారు . ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు తమకు స్పష్టత ఉంది . అందువల్ల జిల్లాలో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తమ కార్యాచరణ ఉండాలని కోరుకుంటున్నాం … తమ నాయకుడు కూడా అదే ఆలోచనతో ఉన్నారని అంటున్నారు . తప్పకుండ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తమ అడుగులు ఉంటాయని పేర్కొంటున్నారు ఆయన అనుచరగణం….

బీజేపీ ,కాంగ్రెస్ నుంచి తమకు మంచి ఆఫర్లు ఉన్నాయి. తమ టార్గెట్ బీఆర్ యస్ …తమనాయకుడికి అన్యాయం చేసిన పార్టీ …అవమానించిన పార్టీ బీఆర్ యస్…. జిల్లాలో ఏపార్టీ తో జతకడితే లేదా అందులో చేరితే బీఆర్ యస్ ను ఢీకొనగలం అనేదే మా ఆలోచన …అందుకు అనుగుణంగా అడుగులు వేస్తామని అంటున్నారు పొంగులేటి అనుయాయులు . అందువల్ల నిన్నమొన్నటివరకు బీజేపీ వైపు వెళ్లనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది . కానీ పొంగులేటి మీమాంస లో పడ్డారు …ఏది అయితే బెటర్ అనే ఆలోచన చేస్తున్నారు .ఆయన వెంట ఉన్నవారిలో మెజార్టీ నాయకులు కాంగ్రెస్ అయితే జిల్లాలో కేక్ వాక్ అవుతుందని దానికి తగ్గట్లుగా నిర్ణయాలు ఉండాలని సూచనలు ఇస్తున్నట్లు సమాచారం …. అయితే పొంగులేటి గానీ ఆయన కార్యాలయం గానీ తమ నాయకుడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అనిశ్చితి కొనసాగుతుందని అంటున్నారు . ఏ పార్టీ అయితే బాగుంటుంది అనే దానిపై మేధో మధనం జరుగుతుంది. రాజకీయాల్లో తనకు గాడ్ ఫాదర్ ఎవరు లేరని చెపుతున్నప్పటికీ ఏపీ సీఎం జగన్ సలహాలు సూచనలు తీసుకుంటారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ , జగన్ ఫలానా పార్టీలో చేరమని చెప్పనప్పటికీ స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తిగా రాజకీయాల్లో నిలదొక్కుకునే విధంగా నిర్ణయాలు ఉండాలని, అది మనలని ప్రేమించే ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉండాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది…నిజంగా కాంగ్రెస్ లో చేరితే మాత్రం జిల్లా రాజకీయల్లో పొంగులేటి” హవాకు” తిరుగుండదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు … ఆయన మాత్రం ఎటు తేల్చుకోలేక సంకట స్థితిలో ఉన్నారు ….చూద్దాం ఏమి జరుగుతుందో ….!

Related posts

సర్పంచ్ నవ్య ఆరోపణలు నిజమైతే రాజయ్యపై చర్యలు తప్పవు: కడియం శ్రీహరి…

Drukpadam

రేపు జగన్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటీ కానున్న సీఎం!

Drukpadam

జిన్నాను హత్య చేసి ఉంటె ….శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ……

Drukpadam

Leave a Comment