Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నా ఊపిరి స్వామి సేవకు అంకితం.. నాకెందుకు పదవులు: చాగంటి

నా ఊపిరి స్వామి సేవకు అంకితం.. నాకెందుకు పదవులు: చాగంటి

  • టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుడిగా చాగంటి నియామకం
  • సలహాలివ్వడానికి పదవులెందుకన్న చాగంటి
  • పదవిని స్వీకరించబోనని స్పష్టీకరణ
  • వైరల్ అవుతున్న వీడియో
  • స్పందించని టీటీడీ

సలహాలు ఇవ్వడానికి పదవి ఎందుకని, తన ఊపిరి స్వామి సేవ కోసమేనని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ జనవరి 20న చాగంటిని టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించింది. అయితే, స్వామి సేవకు తాను ఎప్పుడూ సిద్దమేనని, తనకు పదవులు అవసరం లేదని మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందులో ఆయన మాట్లాడుతూ.. ధర్మ ప్రచార పరిషత్తులోని సభ్యులు, అధ్యక్షులు, ఈవోకు విశేషమైన అనుభవం ఉందని, వారికి సలహాల అవసరం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ వారికి ఏదైనా అనుమానం వచ్చి సలహా అడిగితే చెప్పే శక్తి తనకు ఉండాలి తప్పితే, దానికి పదవే ఎందుకని ప్రశ్నించారు.

పదవి ఇస్తేనే ఆ పని చేస్తానని ఎందుకు అనుకున్నారని అన్నారు. తన ఊపిరి స్వామి సేవకు అంకితమని, అందుకు పనికి వస్తే జీవితం ధన్యమైనట్టేనని అన్నారు. కాబట్టి పదవిని స్వీకరించలేనని స్పష్టం చేశారు. ఈ పని చేసి పెట్టాలని టీటీడీ తనను అడిగితే, తనకు అవకాశం ఉంటే వెంటనే వెళ్లి చేస్తానని చాగంటి పేర్కొన్నారు. అయితే, పదవి స్వీకరించలేనన్న చాగంటి వ్యాఖ్యలపై టీటీడీ ఇప్పటి వరకు స్పందించలేదు.

టీటీడీ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి కోటేశ్వరరావు

Chaganti Koteswararao rejects TTD post

ఏపీ ప్రభుత్వానికి ఊహించని పరిణామం ఎదురైంది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు టీటీడీ సలహాదారు పదవిని తిరస్కరించారు. టీటీడీ ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్టు ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పారాయణం కార్యక్రమాల నిర్వహణ ఆధారంగా ఈ నియామకం చేపట్టినట్టు తెలిపారు.

అయితే, ఈ పదవిని చేపట్టేందుకు చాగంటి కోటేశ్వరరావు విముఖత వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇవ్వడానికే అయితే తనకు పదవులు అవసరం లేదని, టీటీడీకి ఎప్పుడు అవసరం వచ్చినా సహకరించేందుకు తాను ముందుంటానని చాగంటి స్పష్టం చేశారు. వెంకటేశ్వరస్వామి తన ఊపిరి అని పేర్కొన్నారు. ఇటీవల చాగంటి సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే.

Related posts

చూస్తుండగానే కుప్పకూలిన వంతెన.. భయపడిపోయిన ప్రయాణికులు!

Drukpadam

పొంగులేటి ఇళ్ళు ఆఫీసులు ,బంధువుల ఇళ్లపై ఏకకాలంలో 33 చోట్ల ఐటీ దాడులు ..

Ram Narayana

రాజస్థాన్ లో ఓ వైన్ షాపుకు వేలం… రూ.510 కోట్లు పలికిన వైనం!

Drukpadam

Leave a Comment