Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజకీయాలు అంటే డబ్బు పదవులు కాదు….తమ్మినేని

ప్రజల సమస్యలు గాలికి , డబ్బు, పదవులే పరమార్థం దేశ రాజకీయాలపై తమ్మినేని సంచలన వ్యాఖ్యలు …
ప్రజాకంటకంగా మారిన మోడీ పాలన సాగనంపాలి… 
దేశాన్ని అదానీ , అంబానీలు తాకట్టు పెట్టిన మోడీ తీవ్ర విమర్శలు …
హవేలీ సిపిఎం కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ విధానాలపై విరుచుకుపడ్డ తమ్మినేని…

 

ప్రజల సమస్యలు గాలికి వదిలి డబ్బు ,పదవులే పరమార్థంగా రాజకీయాలు నడుస్తున్నాయని ఇది ప్రజాస్వామ్య మనుగడకు అత్యంత ప్రమాదకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు . దేశంలో జరుగుతున్న పరిణామాలు , రాష్ట్ర రాజకీయాలు సిపిఎం కర్తవ్యం పై సంచలన వ్యాఖ్యలు చేశారు . సోమవారం ఖమ్మంలోని సిపిఎం ఖానాపురం హవేలీ* పార్టీ కార్యాలయంను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు . కేంద్రంలో బిజెపి చాలా దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని, దేశంలోని ఉన్న సెక్యులర్ విలువన్ని ప్రజాస్వామ్యక విలువలను ఖునీ చేస్తుందని ధ్వజమెత్తారు . మతతత్వాన్ని రెచ్చగొడుతుందని, ఉన్మాదాన్ని ప్రేరేపిస్తుందన్నారు. ఈ దేశంలో మైనార్టీలు ఉండకూడదని ,ముస్లిమ్, మైనార్టీలు గాని క్రిస్టియన్ మైనార్టీలు ఇతర మతస్తులు మైనార్టీలో ఉన్నవాళ్లు ఈ దేశంలో సెకండ్ గ్రేడ్ పౌరులుగా ఉండాలని , దుర్మార్గమైన మతవిభజన తీసుకొస్తున్నారని కేంద్ర విధానాలు తూర్పార బట్టారు . వీటికి తోడు ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శలు గుప్పించారు . చిన్న పెట్టుబడి దారిగా ఉన్నటువంటి ఆదాని గుజరాత్లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేలకోట్ల అధిపతిగా మారిపోయాడన్నారు. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రి అయిన తర్వాత వేలకోట్లు నుండి లక్షల కోట్లు సంపాదించాడన్నారు. అదేవిధంగా ప్రపంచంలోని అత్యంత కుబేరుడు ఒకడిగా రూపొందించాడన్నారు. భారతదేశంలో ఉన్న ఏ కుబేరుడు అందుకోనంత పెద్ద స్థాయిలో మూడో నెంబర్ కు ఎదిగాడని దుయ్యబట్టారు . ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పటికీ మోడీ నోరుమెదపడం లేదని ఇందుకు వారు బంధమే అడ్డు వస్తుందని ఆరోపించారు .ప్రతిపక్ష నాయకులు అయితే ,ఈడి , సిబిఐ దాడులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు .

 

దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యే పరిస్థితి బీజేపీనే తెస్తుందని అన్నారు . ఒకప్పుడు బిజెపిని బలపరిచిన టిఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ,బిజెపిని గద్దించడమే లక్ష్యంగా పనిచేయడాన్ని స్వాగతిస్తుందని అన్నారు . కెసిఆర్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు , హక్కులకు విఘాతం కలిగిస్తుందని అన్నారు . ,పోడు భూముల పట్టా విషయంలో గాని, దలితుల, ధరణి విషయంలో గాని, భూ సమస్యలు ఇలా చాలా సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు . బిజెపిని గద్దె దించేందుకు అన్ని ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేసి సిపిఐ ,సిపిఎం ముందుకు పోతున్న విషయాన్నీ గుర్తు చేశారు . ఎన్నికలు వస్తే ఏం చేస్తారు. ఓట్లు సీట్లు గురించి అవి అప్పుడు మాట్లాడుకోవచ్చని, అవి చిన్న విషయాలని ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చని ఒక విధానం పరంగా ఈ మతోన్మాద శక్తుల్ని అడ్డుకునేందుకు కృషిని కొనసాగించాలని అన్నారు . గతంలో కమ్యూనిస్టులు పని అయిపోయిందని, కమ్యూనిస్టులు బలహీనపడ్డారని, వారికి ఓట్లు, సీట్లు లేవని ఇలాంటి విమర్శలు కొన్ని ముందుకు వస్తున్నాయని, కాని కమ్యూనిస్టులు ఆ రకంగా వెనక్కు పోయే శక్తి కాదని, తాత్కాలికంగా కొన్ని పరిస్థితుల వల్ల ఓట్లు, సీట్లు రాకపోవచ్చు కానీ, కమ్యూనిస్టులు ఎజెండా లేకుండా ఈ దేశం ముందుకు పోయే పరిస్థితి లేదన్నారు. కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా లేదా అనే సమస్య కాదని, కమ్యూనిస్టులు లేకుండా ఈ దేశానికి భవిష్యత్తు ఉందా లేదనేది ముఖ్యమని, కమ్యూనిస్టుల ఏజెండానే ఈ దేశం ముందుపోవడానికి సరైన మార్గం అవుతుందని అన్నారు. హవేలి కమిటీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయానికి విద్యుత్ ఉద్యమంలో అమరుడైన రామకృష్ణ పేరు పెట్టి సముచితమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న హవేల్ కమిటీని అభినందించారు. కమ్యూనిస్టులు భవనాలు నిర్మించడానికి, మిగతా పార్టీలు భవనాలు నిర్మాణానికి తేడా ఉందని, మిగతా పార్టీలు దర్జా , దర్పం కోసం భవనాలు నిర్మిస్తాయాని, కమ్యూనిస్టు కార్యాలయలు అంటే పేదల కష్టాలు కన్నీళ్లు సమస్యలు కేంద్రాలుగా ఉండాలని ఆకాంక్షించారు .

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, బుగ్గవీటి సరళ, వై. విక్రమ్, భూక్యా వీరభద్రం, బండి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు మాదిని రమేష్, నవీన్ రెడ్డి, తాళ్లపల్లి కృష్ణ,దొంగల తిరుమలరావు , గోపాలరావు,పిన్నింటి రమ్య, వంటం కార్యదర్శి జబ్బర్, కార్యదర్శి సుదర్శన్, త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీను, అర్బన్ కార్యదర్శి మీరా తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ గ్రాఫ్ పడిపోలేదు …ఆ సర్వే టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ ది: పేర్ని నాని

Drukpadam

ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి!

Drukpadam

బీజేపీలోకి ఈటల.. త్వరలోనే బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ!

Drukpadam

Leave a Comment