Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గుండెలు బలహీనమవుతున్నాయ్.. ఏపీలో గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి…

గుండెలు బలహీనమవుతున్నాయ్.. ఏపీలో గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి…

  • గుండెపోటుకు గురైన 17 ఏళ్ల షేక్ ఫిరోజ్
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి
  • చిలకలూరిపేటలో విషాదకర ఘటన

ఇటీవలి కాలంలో గుండెపోటుకు గురవడం, కార్డియాక్ అరెస్ట్ లతో కుప్పకూలిపోవడం వంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. గతంలో ఒక వయసు దాటిన వారికి గుండె సమస్యలు వచ్చేవి. ఇప్పుడు టీనేజ్ వయసు వాళ్లు కూడా కార్డియాక్ అరెస్ట్ లకు గురవుతుండటం అందరినీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఇలాంటి మరో విషాదకర ఘటన ఏపీలోని చిలకలూరిపేటలో చోటు చేసుకుంది.

ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి షేక్ ఫిరోజ్ నిన్న రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. నిద్రిస్తున్న సమయంలోనే గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు అతనిని హుటాహుటిన దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఫిరోజ్ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఫిరోజ్ మృతితో అక్కడ విషాదం నెలకొంది. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

చంద్రబాబు సీఎం అయితే గుండు కొట్టించుకుంటా.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సవాల్

Ram Narayana

తెలంగాణలో తొలిసారి వన్యప్రాణుల కోసం ఓవర్ పాస్ పర్యావరణ వంతెన!

Drukpadam

కుర్చీలతో కొట్టుకున్న న్యాయవాదులు!

Drukpadam

Leave a Comment