Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేసీఆర్‌ కుటుంబమే టార్గెట్‌గా బీజేపీ బ్లాక్‌మెయిల్‌…ఎంపీ వద్దిరాజు

కేసీఆర్‌ కుటుంబమే టార్గెట్‌గా బీజేపీ బ్లాక్‌మెయిల్‌ఎంపీ వద్దిరాజు
కవితకు నోటీసులు పంపడం వెనుక బీజేపీ కుట్రలో భాగమే
దేశంలో బీఆర్‌ఎస్‌కు వస్తున్న ఆదరణ చూసి కుట్రలు
ఈడీ, సీబీఐ లాంటి రాజ్యంగ వ్యవస్థలను భ్రస్టు పట్టిస్తున్న మోడీ..

కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంంత్రి కేసీఆర్‌ కుటుంబం టార్గెట్‌గా బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు తెరలేపిందనీ, ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోని విపక్ష పార్టీలను కనుమరుగు చేసేందుకు కుట్రలకు పాల్పడుతోందని ఎంపీ(రాజ్యసభ సభ్యులు) వద్దిరాజు రవిచంద్ర దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన వైనాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా అవతరించి దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎలాగైనా సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసి ఇరుకున పెట్టాలన్న దురాశతోనే సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం కారణంగా దర్యాప్తు సంస్థలపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని విమర్శించారు. ఒక వైపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి నూకల చెల్లిపోయి, ప్రజలెవరూ పట్టించుకోని పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలోనూ, దేశవ్యాప్తంగా వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేని బీజేపీ కవితమ్మకు నోటీసులు అందించి బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు తెరలేపిందన్నారు. రైతులు, మహిళలు, యువత, వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారికి సబ్బండ వర్గాలకు సమున్నత సంక్షేమ పథకాలు అమలుచేసి దేశంలోనే అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని సాధ్యమైనంత మేరకు ఇబ్బందులు పెట్టి బీఆర్‌ఎస్‌ పార్టీవైపు మళ్లేలా కుట్రలు పన్నుతోందన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించేవారిపైనా, వారితో కలిసి రాని ప్రతిపక్ష నాయకులపైనా, బీజేపీ అంటే గిట్టనివారిపై కేసులు మోపుతూ మానసికంగా వేధించాలని చూస్తోందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కవితకు నోటీసులు ఇచ్చినంత మాత్రన బీఆర్‌ఎస్‌ భయపడిపోదన్నారు. 2014 నుంచి సీబీఐ దాడులు ఎదుర్కొన్న సుమారు 124 మంది రాజకీయ నాయకుల్లో 118 మంది విపక్ష పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్షాలపై విధంగా పగ తీర్చుకుంటున్నదో దీన్నిబట్టే అర్థమవుతున్నదని అన్నారు. ఇందుకు గాను తాజాగా ఢల్లీి ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఉదంతాన్నే ఉదాహరణ అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. గత ఎనిమిదేండ్లుగా ప్రజా సంపదను కార్పొరేట్ల యాజమాన్యాలకు అప్పజెప్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని లూటీ చేస్తున్నది. దీంతో దేశ ప్రజలు ప్రధాని మోదీ పాలనపై విసిగివేసారిపోయారని అన్నారు. ఆదాని వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే నోటీసుల అంశం తెరమీదకు తెచ్చి, ఆప్‌, బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా బీజేపీ కుట్రలకు తెగబడుతోందని ఎంపీ(రాజ్యసభ సభ్యులు) వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు.

Related posts

నేను ప్రజలు వదిలిన బాణాన్ని …షర్మిల

Drukpadam

లాలూప్రసాద్ యాదవ్ ను వదలని కేసులు ..ఢిల్లీ హైకోర్టు సమన్లు !

Drukpadam

విమానయాన రంగంలో కొత్త శకం.. ప్రపంచంలో ఎక్కడికైనా రెండు గంటల లోపే..!

Ram Narayana

Leave a Comment