Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ట్యాంక్‌ బండ్ పై వైఎస్ షర్మిల అరెస్ట్.. మౌన దీక్ష భగ్నం…

ట్యాంక్‌ బండ్ పై వైఎస్ షర్మిల అరెస్ట్.. మౌన దీక్ష భగ్నం…
-తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయంటూ షర్మిల దీక్ష
-రాణి రుద్రమ దేవి విగ్రహం వద్ద కూర్చున్న షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు
-బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలింపు

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయంటూ షర్మిల మౌనదీక్ష చేపట్టారు. ట్యాంక్ బండ్ పై రాణి రుద్రమదేవి విగ్రహం దగ్గర పార్టీ కార్యకర్తలతో కలిసి దీక్షలో కూర్చున్నారు . నోటికి నల్ల గడ్డ కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. బంగారు తెలంగాణలో డ్రగ్స్, మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. దానివల్ల మహిళలపై అత్యచారాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. అయితే, ఈ మౌన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అడ్డొచ్చిన కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై షర్మిల స్పందించారు.

‘ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా నిరసన తెలుపుతున్నా కేసీఆర్ సర్కారు పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గం. మహిళల పక్షాన గొంతెత్తితే బలవంతంగా అరెస్ట్ చేస్తారా? మహిళా దినోత్సవం రోజున ఒక మహిళకు మీరిచ్చే గౌరవం ఇదేనా? సొంత పార్టీ నేతలు అఘాయిత్యాలకు పాల్పడినా మేలుకోడు కేసీఆర్. అత్యాచారాలు,లైంగిక వేధింపుల్లో దక్షిణ భారతంలోనే తెలంగాణను నం.1 స్థానంలో నిలిపిన దొరను, మహిళా లోకం ఎన్నడూ క్షమించదు’ అని ట్వీట్ చేశారు.

Related posts

విదేశీయులు ఇళ్లు కొనకుండా కెనడాలో నిషేధం!

Drukpadam

జీవితాన్ని వదిలేసి.. మాతృభూమి నుంచి పారిపోతున్నా: అందరినీ కదిలిస్తున్న ఆఫ్ఘన్​ యువతి భావోద్వేగ పోస్ట్!

Drukpadam

This 50 Years Old Woman Reveals Secrets of Beauty Through Eating

Drukpadam

Leave a Comment