Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఒకే వేదికపై ఒకేసారి ఇద్దరినీ పెళ్లాడిన వరుడు…

మూడేళ్లుగా ఇద్దరు అమ్మాయిలతో సహజీవనం.. ఇద్దరికీ సంతానం.. ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
  • మరదలు, ప్రేమించిన అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన యువకుడు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన శుభలేఖ

ఇది వినడానికి విచిత్రంగా ఉన్న నిజం …భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లమండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి సత్తిబాబు డీగ్రీవరకు చదువు కున్నారు …అయితే చదువుకునే రోజుల్లో ఒక అమ్మయితే పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది . ఆ అమ్మాయిని ప్రేమిస్తూనే తన బంధువుల అమ్మాయంటే ప్రేమాయణం సాగించారు . మూడు సంవత్సరాలుగా పెళ్లి కాకుండానే వారితో కాపురం కూడా చేశారు . ఫలితం ఇద్దరిలో ఒకరికి పాపా ,మరొకరికి బాబు పుట్టారు . ఇది తెలిసిన అమ్మాయిల తల్లిదండ్రులు వారి కట్టుబాట్ల ప్రకారం పంచాయతీ పెట్టించారు . వారిని అందరికి పిలిచారు . అయితే ఇద్దరు వధువులు అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఇష్ట పడ్డారు .దీంతో అతను కూడా వారి కోరికను అంగీకరించారు . దీంతో ఒకే వేదికపై ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న అరుదైన ఘటన చర్లలో జరగటం ఆసక్తిగా మారింది …. వివరాల్లోకి వెళ్ళితే …

ఒక్కడే వరుడు..ఇద్దరు వధువులను మనువాడాడు. ఈ విచిత్ర ఘటనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల వేదిక అయింది. ఇందుకు సంబంధించిన పెళ్లికార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి సత్తిబాబు డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇంటర్ చదువుతున్న సమయంలో దోశిలపల్లికి చెందిన స్వప్న కుమారిని ప్రేమించాడు. అదే సమయంలో కుర్నపల్లికి చెందిన తన మరదలు సునీతపైనా మనసు పారేసుకున్నాడు.

ఒకరికి పాప.. మరొకరికి బాబు

సత్తిబాబు మూడేళ్లుగా ఇద్దరితోనూ సహజీవనం కొనసాగిస్తున్నాడు. స్వప్నకు పాప, సునీతకు బాబు పుట్టారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలంటూ అమ్మాయి తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో ఇద్దరినీ పెళ్లాడతానని చెప్పాడు. దీంతో విషయం మూడు గ్రామాల పెద్దలకు చేరింది. వారు పంచాయితీ పెట్టారు. అమ్మాయిలు కూడా అతడిని పెళ్లాడేందుకు ఇష్టపడడంతో పెళ్లి నిశ్చయించారు. ఎర్రబోరు గ్రామంలో ఈ ఉదయం 7.04 గంటలకు ఇద్దరి మెడలో సత్తిబాబు తాళి కట్టాడు.

Related posts

యుక్రెయిన్ లో యుద్ధ భయంతో పరుగులు తీస్తున్న ప్రజలు!

Drukpadam

పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు ఇస్తారా?.. మీరు జైలుకు వెళ్తారా?: ఏపీ సీఎస్‌పై హైకోర్టు ఆగ్రహం

Drukpadam

అతిపెద్ద హిందూ దేవాలయానికి ఖరీదైన భూమినిచ్చిన ముస్లిం కుటుంబం!

Drukpadam

Leave a Comment