- అవసరమైతే రాజకీయాల్లోకి తిరిగి వస్తానన్న విజయసాయి రెడ్డి
- జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే తాను దూరంగా ఉంటున్నానని వెల్లడి
- చంద్రబాబుతో తనకు ఎలాంటి వైరం లేదని స్పష్టీకరణ
- పవన్ కల్యాణ్ 20 ఏళ్లుగా తన మిత్రుడని వ్యాఖ్య
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ తనకు 20 ఏళ్లుగా మిత్రుడని, ఆయన్ను తాను ఎప్పుడూ విమర్శించలేదని, భవిష్యత్తులో కూడా విమర్శించబోనని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
శ్రీకాకుళంలో ఆదివారం రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, అయితే ప్రస్తుతానికి మాత్రం రైతుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఓ కోటరీ చేరి, ఆయన్ను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు.
నిబద్ధత లేని వ్యక్తుల మాటలను జగన్ నమ్మవద్దని సూచించారు. వారి వల్లే తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. అయితే, కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన గానీ, వేరే పార్టీలో చేరే ఉద్దేశం గానీ తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనపై అనేక ఒత్తిళ్లు వచ్చినా దేనికీ లొంగలేదని అన్నారు.
మాజీ ఎంపీ వైపీసీ మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి ఒక వింత వాదన ముందుకు తెచ్చారు ..అదేమంటే తనకు పవన్ కళ్యాణ్ 20 గా స్నేహితుడని అందువల్లనే తాను ఆయన్ను ఎప్పుడు ఒక్క మాట అనలేదని ,భవిష్యత్ లో కూడా అననని అన్నారు…ఇంతవరకు బాగానే ఉన్న వైసీపీలో ఉండగా ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ అనరాని మాటలు అన్నారు ..అప్పడు కూడా తాను పవన్ కళ్యాణ్ ను ఒక్క మాట అనలేదని చెప్పడం అంటే తాను నమ్ముకున్న నాయకున్ని , పార్టీకి వమ్ము చేయడమే అవుతుంది కదా …సాయి రెడ్డి గారు ..మీరు పార్టీ వేరు స్నేహం వేరు అనేది లేకుండా స్నేహం అంటూ తెలివిగా వ్యవహరిస్తున్నాని అనుకుంటున్నారు …అది ఏమాత్రం సమర్థనీయం కాదు …ఒక వేళ పవన్ కళ్యాణ్ పార్టీ నచ్చితే అందులో చేరండి …చేరితే జగన్ నాకు 20 లుగా స్నేహితుడని అందువల్ల ఆయన్ను ఒక్క మాట అన్నాను అంటే పవన్ కళ్యాణ్ పార్టీని మోసం చేసినట్లే అవుతుంది ..మిమ్ములను అవమానించడం జరుగుతుంది .. చాలామంది చాల పార్టీలు మారారు ..వారు ఏ పార్టీలో ఉంటె ఆ పార్టీ లైన్ ప్రకారం మాట్లాడక తప్పదు …మీరు పవన్ కళ్యాణ్ నిజమైన స్నేహితులైతే కావచ్చు కానీ ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నేతపై స్నేహితుడు వ్యక్తిగా విమర్శలు చేస్తున్నప్పుడు వాటిని తిప్పికొట్టాల్సిందే …లేక పొతే మీ నిజాయతీగా మచ్చగా మిగులుతుందనే విషయాన్నీ గుర్తు పెట్టుకోండి ..
Save or share this story as a newspaper-style Epaper Clip: