సిద్దంకండి …నో డౌట్ షడ్యూల్ ప్రకారమే డిసెంబర్ లో ఎన్నికలు …కేసీఆర్
–కార్యరంగంలోకి దిగండి …మళ్ళీ మనదే అధికారం
–ప్రజల్లోకి వెళ్ళండి …ప్రభుత్వ పథకాలు వివరించండి
–యాత్రలు చేపట్టాలి …సభలు పెట్టాలి
–అక్టోబర్ కల్లా పనులు పూర్తి చేసుకోండి.
సిద్దంకండి ….నో డౌట్ షడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళుతున్నాం …అంటూ కేసీఆర్ ముందస్తు ఎన్నికలు అంటూ ఇంతకాలం జరుగుతున్న ప్రచారానికి తెరదించారు . ఈఏడాది చివరలో అంటే డిసెంబర్ లో ఎన్నికలు ఉంటాయి. అందువల్ల ప్రజాప్రతినిధులు కార్యరంగంలోకి దిగండి . ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని విమరించండి . మళ్ళీ మనదే అధికారం అని బీఆర్ఎస్ అధ్యక్షులు సీఎం కేసీఆర్ అన్నారు . శుక్రవారం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తిరిగి మనమే అధికారంలో కి వస్తున్నామని అందులో ఎలాంటి సమస్యలేదని అనేక సర్వే సంస్థలు అదే విషయాన్నీ చూపుతున్నాయని అన్నారు .
తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధి చెందినదని మనమే కాదు కేంద్రమే చెపుతున్న విషయాన్నీ ప్రస్తావించారు . అందువల్ల మనం చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకోని వెళ్లాలని అందుకు కార్యక్షేత్రంలో ఎమ్మెల్యేలు ఉండాలని అన్నారు . అందరిని కలుపుకొని పోవాలని ఉద్బోధించారు .
అక్టోబర్ కల్లా నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేసుకోవాలని అన్నారు . దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనది . దళిత బందు , రైతు బందు , కల్యాణ లక్ష్మి , షాదిముబారక్ , లాంటి కార్యక్రమాలు , సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి వాటితో మనం ప్రజలకు ఎంతో మేలు చేసిన విషయాలను గుర్తు చేశారు . వాటి లెక్కలు అన్ని సేకరించి నియోజకవర్గంలో ,జిల్లాలో ,రాష్ట్రంలో చేసిన అభివృద్ధి చేసిన ఖర్చు ప్రజలకు చెప్పాలని అన్నారు . నిన్న జరిగిన మంత్రివర్గం సమావేశంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నాం దళిత బందు నియోజకవర్గానికి 11 యూనిట్లు ఇస్తున్నాం ..సొంతస్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు 3 లక్షలు ఇవ్వబోతున్నాం …ఇంకా రెగ్యూలరైజ్ కానీ పేదల స్థలాలను రెగ్యూలరైజ్ చేసుకునేందుకు గడువు ఇచ్చాం …వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండని కేసీఆర్ అన్నారు . ప్రభుత్వం అనేక ప్రజా ప్రయోజన నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ, వాటిని ప్రజా క్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు మరింత చొరవచూపాలన్నారు .
గెలుపే లక్ష్యంగా పని చేయండి.
ఎమ్మెల్యేలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి … వీలైనంత వరకు ప్రజాక్షేత్రంలోనేఉండాలని ప్రజల సమస్యలను తీర్చాలని తీర్చకపోతే ఎందుకు తీర్చలేక పోయామే చెప్పాలని అన్నారు
త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభించుకుందాం
హైద్రాబాద్ నడిబొడ్డున అత్యంత సుందరంగా నిర్మించిన కొత్త సచివాలయం అంబెడ్కర్ భవనం ను త్వరలో ప్రారంభించుకుందామని అన్నారు . ఇప్పటికే నిర్మాణం పూర్తీ అయిందని ,ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయిందని అన్నారు .
పార్టీలో అన్నిస్థాయిల నాయకులను కలుపుకొని పొండి.
ఎన్నికలు నెత్తిమీదికి వస్తున్నా వేళ నియోజకవర్గాల్లో అన్ని స్థాయిల్లో ఉన్న కార్యకర్తలను , నాయకులను కలుపుకొని పోయేందుకు కృషి చేయాలనీ అన్నారు . చిన్న చిన్న తేడాలు ,పొరపొచ్చాలు ఉంటె పరిష్కరించుకోవాలని సూచించారు .
త్వరలో వరంగల్లో భారీ బహిరంగ సభ.
రాష్ట్రంలో కీలకంగా ఉన్న వరంగల్ లో భారీ బహిరంగసభ ను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నల్టు కేసీఆర్ తెలిపారు
ఇకపై టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉండదు. బదులుగా బీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాలు ఉంటాయి.