Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కవితను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం …?

కవితను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం …?
-లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు …
-ఢిల్లీలో శనివారం ఈడీ ఎదుట హాజరు కానున్న కవిత …
-రామచంద్రపిళ్ళై వాంగ్మూలంలో కవిత బినామీగా ఉన్నట్లు చెప్పారని ప్రచారం …
-తాను ఈడీ ఎదుట చేసిన తన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు -రామచంద్రపిళ్ళై కోర్టులో పిటిషన్
-దీనిపై పలు అనుమానాలు…వత్తిళ్లు ఉండవచ్చుననే సందేహాలు

-కవిత ఈడీ ఎదుట హాజరుపై కేసీఆర్ స్పందన…
-చెల్లికి బాసటగా ఢిల్లీకి కేటీఆర్ …

 

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇరుక్కున్న కవిత ను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తారా …? లేదా ? అనేది ఆసక్తిగా మారింది . తప్పకుండ చేసే అవకాశం ఉందని బలంగా ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ ఆమెను కావాలని ఛార్జ్ షీట్లో పేరు చేర్చి ఇబ్బందులు పెడుతున్నారని బీఆర్ యస్ నేతలు ఆరోపిస్తున్నారు . ఇవి ఈడీ నోటీసులు కాదని మోడీ నోటీసులు అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు . ఆమెను ప్రశ్నించేందుకు 9 తేదీన హాజరు కావాలని ముందు నోటీసులు ఇచ్చారు .అయితే ఆమెకు ముందు అనుకున్న కార్యక్రమాలు ఉన్నందున తాను 15 వ తేదీన హాజరైయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఈడీ అధికారులకు లేఖ రాశారు .ఈడీ అధికారులు అన్ని రోజులు ఆగాటం కుదరదని 11 తేదీన హాజరు కావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు .దీంతో ఆమె 11 తేదీన హాజరు కానున్నారు .

ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది .ఆమెను అరెస్ట్ చేస్తే తెలంగాణ వ్యాపితంగా నిరసనలు చేపట్టేందుకు బీఆర్ యస్ శ్రేణులు సిద్ధపడుతున్నాయి. కవితను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించడం తెలిసిందే … అసలు ఈడీ ,మోడీ టార్గెట్ కవిత కాదని బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలను ఏకం చేస్తున్న బీఆర్ యస్ అధినేత కేసీఆర్ అని అంటున్నారు .ఇప్పటికే ఈ కేసులో పలువురిని ఈడీ అధికారులు ప్రశ్నించి అరెస్ట్ చేశారు . కవిత కు తాను బినామీగా ఉన్నానని రామచంద్రపిళ్ళై ఈడీ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు .నేడు తాను ఈడీ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెన్నక్కు తీసుకుంటున్నట్లు తెలపడంపై మరిన్ని సందేహాలకు తావిస్తోందని విశ్లేషకులు అంటున్నారు . అయితే ఆడిటర్ బుచ్చిబాబు విచారణలో 100 కోట్లు చేతులు మారినట్లు తెలిపాడని తెలుస్తుంది . తనకు లిక్కర్ స్కాం తో సంబంధం లేదని న్యాయపోరాటం చేస్తానని కవిత పేర్కొంటున్నారు ….

 

కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ స్పందన

CM KCR reacts to ED notice to Kavitha

తన కుమార్తె కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు పంపడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. కేంద్రంలో దుర్మార్గపు ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. దర్యాప్తు సంస్థలతో వేధించే విధానం ఎంచుకుందని మండిపడ్డారు. మంత్రులతో మొదలుపెట్టి, ఇప్పుడు కవిత వరకు వచ్చారని వ్యాఖ్యానించారు.

ఏం చేస్తారో చేసుకోనివ్వండి… కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పోరాటం మాత్రం ఆపేది లేదు అని హెచ్చరించారు. బీజేపీని గద్దె దింపే వరకు విశ్రమించొద్దు అని పార్టీ శ్రేణులకు కర్తవ్య బోధ చేశారు. సీఎం కేసీఆర్ ఇవాళ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు.

  చెల్లికి బాసటగా ఢిల్లీకి కేటీఆర్ …   
KTR goes to Delhi as Kavitha set to attend ED questioning

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు వేగం పుంజుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ రేపు విచారించనుంది. ఈ నేపథ్యంలో, కవిత సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ హుటాహుటీన ఢిల్లీ బయల్దేరారు. కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, కేటీఆర్ ఢిల్లీ పయనమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు, ముఖ్యనేతలు కూడా ఢిల్లీ బయల్దేరారు.

లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 9న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు పంపడం తెలిసిందే. అయితే తనకు ఈ నెల 9, 10వ తేదీల్లో కూడా తీరిక లేదని, 11వ తేదీన విచారణకు వస్తానని కవిత ఈడీకి బదులిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె రేపు (మార్చి 11) ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.

Related posts

అమెరికాలో దారుణం ..బర్గర్ తింటున్న యువకున్ని దారుణంగా కాల్చి చంపిన పోలీస్ !

Drukpadam

హైద్రాబాద్ తుపాకీ తో కాల్చుకున్న అక్బరుద్దీన్ వియ్యంకుడు డాక్టర్ మజారుద్దీన్!

Drukpadam

గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి.. వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Ram Narayana

Leave a Comment