ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందని జీతాలు …ఉద్యోగుల గగ్గోలు…
–ఉద్యోగులకు పెన్షనర్లకు ఎదురు చూపులు
–నెలవారీ ఖర్చులకోసం అప్పులు చేస్తున్న వైనం
–కిస్తీలకు , చేబదుళ్లకు ఇబ్బందులు
–రోజు బ్యాంకు అకౌంట్ చూసుకుంటూ తోటి ఉద్యోగులను ఆరా తీసుతున్న వైనం
–ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 28 వేల మంది ఉద్యోగులు ,టీచర్స్ ,పెన్షనర్లు
తెలంగాణ ధనిక రాష్ట్రం …మన ఆదాయం ఘనం …దేశం మనవైపు చూస్తుంది . తెలంగాణ మోడల్ తమకు కావాలని ,అనేక రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. పక్క రాష్ట్రాల గ్రామాలు తమను తెలంగాణాలో కలపాలంటూ వేడుకుంటున్నాయి. ఇది నిత్యం మనపాలకులు చెప్పే మాటలు …కానీ ఆచరణలో జరుగుతున్నదేమిటి …? ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడంలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. నిరుద్యోగులకు భృతి లేదు.
ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ లు లేవు…ఒకటో ఆరో ఇచ్చినా, మరో రెండు డిఏ లు పెండింగ్ లో ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 28 వేల మంది ఉద్యోగులు ,టీచర్స్ ,పెన్షనర్లు ఉన్నారు .వారికి ప్రతినెలా ఒకటవ తేదీన అకౌంట్ లో పడాల్సిన వేతనాలు గత కొన్ని సంవత్సరాల కాలంగా ఆలస్యం అవుతున్నాయి. 10 వ తేదీన దాటినా పడటంలేదు …ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 తేదీవరకు పడతాయని కళ్ళు కాయలు కాసేలా చూసిన జీతాలు పడకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తుంది. … మధ్యలో 12 వ తేదీన ఆదివారం వచ్చింది . ఇక 13 వ తేదీన వస్తాయా ? లేదా అనే మీమాంశ ఉంది.
ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా తప్ప రాష్ట్రంలోని మిగతా జిల్లాల ఉద్యోగులకు వేతనాలు పడ్డాయని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు షేక్ అఫ్జల్ హాసన్ అంటున్నారు. కొద్దిగా ఆలస్యం అయినాఖమ్మం జిల్లాలోకూడా పడతాయని అన్నారు .
28 వేల మంది ఉద్యోగుల్లో 12 వేల మంది ఉపాధ్యాయులు , 9 వేల మంది ఉద్యోగులు , 7 వేల మంది పెన్షనర్లు ఉన్నారు … వేతనాలు ఆలస్యం కావడం, తమ అవసరాలు నెత్తిమీదకు రావడంతోఉద్యోగులు ,పెన్షనర్లు గగ్గోలు పెడుతున్నారు .
దేవాదాయ శాఖలో పనిచేసి ఐదు సంవత్సరాల క్రితం రిటైర్ అయినా ఒక ఉద్యోగికి పెన్షన్ నెలకు 30 వేల రూపాయలు వస్తుంది….ప్రతినెలా దానిపై ఆధారపడి తన ఆర్థిక లావాదేవీలనుఆయన అతిజాగ్రత్తగా కొనసాగిస్తారు . తన పిల్లలు షటిల్ అయినప్పటికీ వారి దగ్గర నుంచి పైసా తీసుకోకుండా తనకొచ్చే పెన్షన్ తో సర్దుబాటు చేసుకుంటారు …ఈనెల ఇప్పటివరకు రావాల్సిన పెన్షన్ ఇంతవరకు రాలేదు … కొద్దో గొప్పోబ్యాంకులో ఉన్న బాలన్స్కట్టాలిసిన అప్పుకింద బ్యాంకు వారు అకౌంట్ నుంచి కట్ చేసుకున్నారు . ఇప్పుడు ఆయన అకౌంట్ లో జీరో బాలన్స్ చూపిస్తుంది . రోజువారీ ఖర్చులకోసం పెన్షన్ ఎప్పుడు పడుతుందా అని ఆయనఎదురు చూస్తున్నారు . ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు .
నెలనెలా వచ్చే జీతం ఉందన్న భరోసాతోసన్నగిల్లింది. వెహికల్స్ , ఇంటిలోనూ, పిల్లల చదువులు , వైద్యఖర్చుల కోసం వెతుకులాట ప్రారంభించారు .వేతనాలు సకాలంలో రాక వేతన జీవులు కష్టాల్లో ఉన్నారు .దీనికి తోడు ఇదే నెలలో ఇన్ కం టాక్స్ కూడా కట్ అవుతుంది. దీంతో పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది ఉద్యోగుల పరిస్థితి….
ఈ పరిస్థితిలో కేవలం జీతం మీదనే ఆధారపడే సగటు వేతన జీవులు బ్రతుకులు దుర్భరంగా తయారైయ్యాయి. బ్యాంకు లోన్లు , చిట్టీల కిస్తీలు , చేబదుళ్ళు ,పచారీ కొట్లో ఇవ్వాల్సిన బకాయిలకు ఇబ్బందులు పడుతున్నారు . రోజు తెచ్చుకునే కూరగాయలకు సైతం నోట్ల సంగతి దేవుడెరుగు చిల్లర లేక జేబులు చూసుకుంటున్నారు .
మరికొందరు ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది … మార్చ్ నెల పిల్లల చదువులకు చివరిలో కట్టాల్సిన ఫీజులు ఇవ్వకపోతే పరీక్షలు రాయనివ్వడంలేదు … హాల్ టికెట్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు . పైగా ఫీజుల నియంత్రణ లేదు …హైటెక్ చదువులని, ఒలంపియాడ్ అని , ఐ ఐ టి ,ఎంసెట్ పేరుతొ ఫీజుల బాదుడే బాదుడు కొనసాగుతుంది. సామాన్యుడు తమ పిల్లలను చదివించలేక కూలిపనులు పంపుతున్నారు . దీంతో ధనిక రాష్ట్రంలో ఉద్యోగులవెతలు చెప్పనలవి కాకుండా ఉన్నాయనిపలువురు ఉద్యోగులు వాపోతున్నారు .ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు సకాలంలో చెల్లించే ఏర్పాట్లు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు …