Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నల్లారి, సినీ నటుడు మోహన్ బాబు బీజేపీ వైపు చూస్తున్నారా …?

బీజేపీలో చేరనున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి?

  • ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపిన బీజేపీ అగ్ర నేతలు
  • రెండు, మూడు రోజుల్లో బీజేపీలో చేరే అవకాశం
  • కిరణ్ కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి,  సినీ నటుడు మోహన్ బాబు  బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు నేడు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పదవులు అనుభవించిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను పూర్తిగా వ్యతిరేకించారు . అయినప్పటికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తూ పార్లమెంట్ లో బిల్లు తెచ్చారు . దీంతో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి జై సమైఖ్యఆంధ్ర పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీచేశారు . అయితే ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు …దీంతో ఆయన అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు . అయితే సంవత్సర కాలం క్రితం తిరిగి కాంగ్రెస్ అగ్రనేతలు ఆయన్ను ఢిల్లీకి పిలిచి మాట్లాడారు .ఆయన ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.అయినప్పటికీ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు …అయితే బీజేపీ లో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన వల్ల బీజేపీకి ఉపయోగం జరుగుతుందా …? అనే ఆసక్తి ఏపీ రాజకీయాల్లో నెలకొన్నది . అయితే ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది కూడా తెలియాల్సిఉంది .

కిరణ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది . ఆయన బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్టు చెపుతున్నారు. ఇప్పటికే ఆయనతో బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లో బీజేపీ అగ్ర నాయకుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఆయనకు కీలక బాధ్యతలను కూడా అప్పగించనున్నారని చెపుతున్నారు.

తన రాజకీయ జీవితాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభించి, ఇప్పటివరకు ఆ పార్టీలోనే కొనసాగారు. ముఖ్యమంత్రి పదవితో పాటు పలు బాధ్యతలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విభజనను ముఖ్యమంత్రిగా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో… ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. ఆ తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పడు ఆయన మరోసారి యాక్టివ్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు.

మోహన్ బాబుతో భేటీ అయిన సోము వీర్రాజు

  • తిరుపతిలోని మోహన్ బాబు నివాసంలో సమావేశం
  • ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని విన్నపం
  • గత ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతిచ్చిన మోహన్ బాబు

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబును ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. తిరుపతిలోని మోహన్ బాబు నివాసంతో వీరి సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మోహన్ బాబును వీర్రాజు కోరారు. మరోవైపు మీడియాతో సోము వీర్రాజు మాట్లాడుతూ… బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వీర్రాజు స్పందిస్తూ… కిరణ్ కుమార్ రెడ్డి చాలా చురుకైన వ్యక్తి అని చెప్పారు.

ఇదిలావుంచితే, గత ఎన్నికల సమయంలో మోహన్ బాబు వైసీపీకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత తన కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు.

Related posts

వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ గా పోటీచేయనున్న జయప్రకాశ్ నారాయణ!

Drukpadam

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజ్యసభ సీటు …జరుగుతున్న చర్చ…

Drukpadam

కేసీఆర్ కోరుకున్నట్లుగానే మిమ్మల్ని అధ్యక్షుడిగా చేశారనే విమర్శలపై కిషన్‌రెడ్డి సమాధానం !

Drukpadam

Leave a Comment