Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

భట్టి పాదయాత్రలో పాల్గొంటా ….. కోమటిరెడ్డి వెంకటరెడ్డి

భట్టి పాదయాత్రలో పాల్గొంటా ….. కోమటిరెడ్డి వెంకటరెడ్డి
భట్టి నన్ను పిలిచారన్నకోమటిరెడ్డి …
రేవంత్ పాదయాత్రకు నన్ను పిలవలేదని వెల్లడి
మల్లు భట్టి విక్రమార్కతో కోమటిరెడ్డి సమావేశం
కొన్ని సూచనలు చేశానని వెల్లడి
శని, ఆదివారాల్లో మాత్రమే పాదయాత్రలో పాల్గొంటానన్న కోమటిరెడ్డి

 

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఒకపక్క టీపీసీసీ అధ్యక్షుడు ,యాత్ర చేస్తుండగా మరో పక్క సీఎల్పీ నేత భట్టి యాత్రకు కూడా కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . భట్టి చేపట్టబోయే పాదయాత్రలో తాను తప్పకుండ పాల్గొంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు .తనను భట్టి పాదయాత్రలో పాల్గొనాలని ఆహ్వానించారని పేర్కొన్నారు .

రాహుల్ గాంధీ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో హత్ సే హత్ జోడో యాత్రలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణాలో ఇప్పటికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి యాత్ర కొనసాగిస్తుండగా , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ను కూడా యాత్ర కొనసాగించాలని ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రి నుంచి ఖమ్మం జిల్లా వరకు సుమారు 13 వందల కి .మీ పాదయాత్ర చేపట్టనున్నారు . ఈ యాత్రలో జోడో యాత్ర సందేశాన్ని ప్రజలకు చేరవేయడంతోపాటు రాష్ట్రలో కేసీఆర్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని భట్టి తెలిపారు . ఈ యాత్ర ఏర్పాట్లను ఏఐసీసీ పరిశీలిస్తుందని యాత్రలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారని తెలిపారు . తాను చేపట్టనున్న పాదయాత్రలో పాల్గొనాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని స్వయంగా భట్టి ఆదివారం హైద్రాబాద్ లో కలిసి కోరారు .అందుకు ఆయన అంగీకరించారు . పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ప్రతి శని,ఆదివారాల్లో యాత్రలో పాల్గొంటానని ఆయన తెలిపారని భట్టి పేర్కొన్నారు . కోమటిరెడ్డి కూడా భట్టి మాటలను ధ్రువీకరించారు . తాను భట్టికి కొన్ని సూచనలు చేశానని వివరించారు .

రేవంత్ రెడ్డి యాత్రలో పాల్గొనలేదని దానిపై ఆయనస్పందిస్తు తనను పాదయాత్రలో పాల్గొనాలని పిలవలేదని రేవంత్ రెడ్డి పిలవలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. అయితే, తన పాదయాత్రలో పాల్గొనాలని భట్టి విక్రమార్క ఆహ్వానించారని, అందుకే తాను భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొంటానని వెల్లడించారు. నల్గొండ, మంచిర్యాల, జడ్చర్ల/షాద్ నగర్ లో బహిరంగ సభ… నకిరేకల్, సూర్యాపేటలో మినీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సూచించినట్టు వివరించారు.

Related posts

గజ్వేల్‌కు ఎట్ల వస్తవో అంటివి కదా కేసీఆర్.. ఇప్పుడు కనిపించిందా బొమ్మ: సీతక్క!

Drukpadam

మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ స‌భ్య‌త్వం తీసుకున్న ఎల్‌.ర‌మ‌ణ‌…

Drukpadam

నీటి పంపకాల విషయంలో ఆంధ్రా ,తెలంగాణ మధ్య యుద్ధమే !

Drukpadam

Leave a Comment