Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జులై నుంచి విశాఖలోనే పాలన స్పష్టం చేసిన జగన్ …!

జులైలో విశాఖకు తరలి వెళుతున్నాం: సీఎం జగన్

  • సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
  • విశాఖకు వెళ్లేందుకు ముహూర్తం ఖరారు
  • విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని మంత్రులతో చెప్పిన వైనం

జులై నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన కొనసాగించేందుకు ఏపీ సీఎం జగన్ సిద్దపడుతున్నారు . తాను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన మూడు రాజధానులు అంటూ వస్తున్నారు .దానిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఏపీ కి ఏకైన రాజధానిగా అమరావతి ఉంటుందని అప్పటి ప్రభుత్వం చెప్పిందని అందువల్లనే తాము భూములు ఇచ్చామని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాన్ని మార్చటానికి వీల్లేదని వాదిస్తుంది. తన వాదనలు అనుగుణంగా రైతుల దీక్షలు , కోర్ట్ లో కేసులు ఇలా జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సైతం ఇరుకున పెట్టె ప్రయత్నం చేశారు .అయితే రాజధాన్ని నిర్ణయించుకునే అధికారం ఎవరికుంది ,ప్రభుత్వానికి ఆ ప్రాంత ప్రజలకా అనేది ప్రధాన సమస్యగా మారింది. చివరకు చట్టసభలకు రాజధాన్ని నిర్ణయించుకునే అధికారం లేదన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇది సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళింది.రాజ్యాంగంలో దీనిపై ఎలాంటి చట్టం ఉంది .గతంలో కొన్ని రాష్ట్రాల్లో రాజధానులను , హైకోర్టు లను మార్చిన విషయాలను కూడా సుప్రీం పరిశీలించి తదనుగుణంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. అయితే తమకు అనుకూలంగానే తీర్పు ఉంటుందని జగన్ సర్కార్ భావిస్తుంది .అందువల్లనే నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో సైతం జులై నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన ఉంటుందని జగన్ చెప్పినట్లు వస్తున్నా వార్తలు జగన్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు అర్థం అవుతుంది.

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నేడు క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, జులైలో విశాఖకు తరలివెళుతున్నామని తెలిపారు. విశాఖ నుంచే పాలన ఉంటుందని వెల్లడించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ వైసీపీనే గెలవాలని స్పష్టం చేశారు. మీ పనితీరును గమనిస్తున్నాను… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా మనవాళ్లను గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ మంత్రివర్గ సహచరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

సీఎం జగన్ విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని, ఏపీ రాజధాని విశాఖేనని ఢిల్లీలోనూ, ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులోనూ ప్రకటించడం తెలిసిందే. విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎం జగన్ తమ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టు తాజాగా క్యాబినెట్ భేటీలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.

Related posts

ఇది జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ: సోము వీర్రాజు

Drukpadam

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రష్యా టూర్ పై దుమారం!

Drukpadam

టీఆర్ యస్ లో బీసీ ఎస్సీ ,ఎస్టీ , మైనార్టీల అంతర్మధనం …

Drukpadam

Leave a Comment