Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అసైన్డ్ భూముల్లోని గుడిసెల‌కు నిప్పు.. న‌ర్సంపేట‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌

13-05-2021 Thu 11:48

  • వ‌రంగ‌ల్ గ్రామీణం జిల్లాలోని కాక‌తీయ న‌గ‌ర్ వ‌ద్ద ఘ‌ట‌న‌
  • మంటలు అంటుకుని 50 గుడిసెలు ద‌హ‌నం
  • నెల రోజుల క్రితం అసైన్డ్ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేద‌లు
  • మొత్తం 200 గెడిసెలు
  • త‌మ భూముల్లో వేసుకున్నార‌ని పేద‌ల‌పై వెంక‌ట‌య్య అనే వ్య‌క్తి దాడి

వ‌రంగ‌ల్ గ్రామీణం జిల్లాలోని న‌ర్సంపేట కాక‌తీయ న‌గ‌ర్ వ‌ద్ద అసైన్డ్ భూముల్లో క‌ల‌క‌లం చెల‌రేగింది. అక్కడి గుడిసెల‌కు బైర‌బోయిన వెంక‌ట‌య్య  అనే వ్య‌క్తి, ఆయ‌న‌ కుటుంబ స‌భ్యులు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. మంటలు అంటుకుని 50 ద‌హ‌నమ‌య్యాయి.

ఆ ప్రాంతంలోని అసైన్డ్ భూముల్లో నెల రోజుల క్రితం పేద‌లు గుడిసెలు వేసుకున్నారు.  అక్క‌డ మొత్తం 200 గుడిసెల్లో పేద‌లు నివాసం ఉంటున్నారు. త‌మ భూముల్లో వేసుకున్నార‌ని పేద‌ల‌పై వెంక‌ట‌య్య కుటుంబ స‌భ్యులు దాడికి పాల్ప‌డ్డారు.  వారు గుడిసెల‌కు నిప్పు పెడుతోన్న స‌మ‌యంలో అడ్డుకున్న గుడిసెవాసుల‌పై దాడుల‌కు దిగుతూ రెచ్చి పోయారు.

వెంక‌టయ్య కుటుంబ స‌భ్యుల దాడిలో న‌లుగురికి గాయాలయ్యాయి. చివ‌ర‌కు గుడిసెవాసులంతా క‌లిసి 10 మంది నిందితుల‌ని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా చూస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ ప్రారంభించారు.

Related posts

హోలీ రోజూ డీజే పెట్టాడని యువకుడిని కొట్టి చంపిన పోలీసులు.. స్టేషన్ కు నిప్పు పెట్టిన ప్రజలు.. దాడిలో కానిస్టేబుల్ మృతి

Drukpadam

తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..ఒత్తిడి చేయొద్దని ఆదేశం!

Drukpadam

వారణాసిలో మమతకు నల్లజెండాలతో నిరసన సెగ…

Drukpadam

Leave a Comment