Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ బడ్జెట్ 2,79,279 కోట్లు…అసెంబ్లీలోప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన…

ఏపీ బడ్జెట్ 2,79,279 కోట్లు…

  • అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన
  • సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
  • సాధారణ బడ్జెట్ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
  • అన్ని వర్గాల సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు వెల్లడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం ఉదయం బడ్జెట్ పద్దును ప్రవేశపెట్టారు. ఈ ఏడాది రూ.2,79,279 కోట్ల భారీ బడ్జెట్ ను వైసీపీ సర్కారు ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో మంత్రి బుగ్గన బడ్జెట్ పై ప్రసంగిస్తున్నారు. ఈ బడ్జెట్ లో వివిధ శాఖలు, సంక్షేమ పథకాలకు జరిపిన కేటాయింపులను మంత్రి వివరిస్తున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది.

2023-24 సాధారణ బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలిపింది. దీంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా శాసనసభలో మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ , కుతూహలమ్మ, పాతపాటి సర్రాజుతో పాటు మరో ముగ్గురు సభ్యుల మృతి పట్ల సభ సంతాపం తెలిపింది. అనంతరం బడ్జెట్ పద్దును ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన.. బడ్జెట్ పై ప్రసంగిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు మంత్రి వివరించారు.

సంక్షేమానికే పెద్దపీట.. ఏపీ బడ్జెట్ హైలైట్స్ – 1

అమ్మ ఒడికి – రూ. 6,500 కోట్లు

జగనన్న విద్యా దీవెనకు – రూ. 2,841.64 కోట్ల

వైఎస్సార్ ఆసరాకు – రూ. 6,700 కోట్లు

Andhra Pradesh budget

2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్లతో బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంక్షేమానికే బడ్జెట్ లో పెద్ద పీట వేశారు.

బడ్జెట్ హైలైట్స్:

  • రెవెన్యూ వ్యయం – రూ. 2,28,540 కోట్లు
  • రెవెన్యూ లోటు – రూ. 22,316 కోట్లు
  • మూలధన వ్యయం – రూ. 31,061 కోట్లు
  • ద్రవ్య లోటు – రూ. 54,587 కోట్లు
  • జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతం
  • జగనన్న విద్యా దీవెనకు – రూ. 2,841.64 కోట్లు
  • జగనన్న వసతి దీవెన – రూ. 2,200 కోట్లు
  • వైఎస్సార్ రైతు భరోసా – రూ. 4,020 కోట్లు
  • వైఎస్సార్ పెన్షన్ కానుక – రూ. 21,434.72 కోట్లు
  • వైఎస్సార్ పీఎం బీమా యోజన – రూ. 1,600 కోట్లు
  • రైతులకు వడ్డీ లేని రుణాలు – రూ. 500 కోట్లు
  • డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు – రూ. 1,000 కోట్లు
  • వైఎస్సార్ వాహనమిత్ర – రూ. 275 కోట్లు
  • వైఎస్సార్ మత్స్యకార భరోసా – రూ. 125 కోట్లు
  • జగనన్న చేదోడు – రూ. 350 కోట్లు
  • మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ – రూ. 50 కోట్లు
  • లా నేస్తం – 17 కోట్లు
  • రైతు కుటుంబాలకు పరిహారం – రూ. 20 కోట్లు
  • వైఎస్సార్ నేతన్న హస్తం – రూ. 200 కోట్లు
  • ఈబీసీ నేస్తం – రూ. 610 కోట్లు
  • వైఎస్సార్ ఆసరా – రూ. 6,700 కోట్లు
  • వైఎస్సార్ కల్యాణమస్తు – రూ. 200 కోట్లు
  • జగనన్న తోడు – రూ. 35 కోట్లు
  • వైఎస్సార్ చేయూత – రూ. 5,000 కోట్లు
  • అమ్మ ఒడి – రూ. 6,500 కోట్లు
  • ధర స్థిరీకరణ నిధి – రూ. 3 వేల కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణకు – 1,212 కోట్లు.

Related posts

నిద్రలేమితో దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు: నిపుణుల హెచ్చరిక!

Drukpadam

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు..!

Drukpadam

ఆస్తి కోసం కుమారుడి పట్టు… ప్రభుత్వానికి రాసిచ్చేసిన తండ్రి!

Drukpadam

Leave a Comment