Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బెంగాల్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామా!

  • బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచిన బీజేపీ
  • ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన బీజేపీ ఎంపీలు
  • ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు ఎంపీలు

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైన కాషాయ పార్టీ… ఈ సారి ఏకంగా 77 స్థానాల్లో గెలుపొంది… బెంగాల్ లో బలమైన పార్టీగా అవతరించింది. అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 75కి తగ్గిపోయింది.

బీజేపీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు నిశిత్ ప్రామాణిక్, జగన్నాథ్ సర్కార్ లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అయితే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎంపీలుగా కొనసాగాలంటూ వారిద్దరికీ  పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. హైకమాండ్ ఆదేశాలతో వారిద్దరూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 75కి తగ్గింది.

నిశిత్, జగన్నాథ్ లతో పాటు మరో ముగ్గురు ఎంపీలను బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి బీజేపీ దింపింది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా కీలక పాత్రను పోషిస్తారనే భావనతో వీరికి టికెట్లు ఇచ్చింది. అయితే, మమతా బెనర్జీ భారీ మెజార్టీ సాధించి మరోసారి అధికారపీఠం ఎక్కారు. ఈ నేపథ్యంలో, అసెంబ్లీలో వీరిద్దరూ ఉండి చేయాల్సిందేమీ లేదని, వీరు పార్లమెంటులో ఉంటే పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని బీజేపీ హైకమాండ్ భావించింది. దీంతో, వారితో ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయించింది.

Related posts

రమ్య తల్లిదండ్రులను క్యాంపు కార్యాలయానికి తీసుకువచ్చినహోంమంత్రి… అక్కున చేర్చుకుని ఓదార్చిన సీఎం జగన్!

Drukpadam

వివేకా కేసులో నా వాంగ్మూలం తొలగించండి..

Ram Narayana

Design Community Built Omaha Fashion Week From The Runway Up

Drukpadam

Leave a Comment