Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పంట నష్ట పరిశీలనకు సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటన…

ఆకాల వర్షాలకు పంటల నష్టం …పరిశీలనకు సీఎం ఆకస్మిక పర్యటన
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం లక్ష్మీపురంలో పర్యటన
రేపు నాలుగు జిల్లాల్లో పంటలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్‌

ఎంపీలు ,ఎమ్మెల్సీ,   ఎమ్మెల్యేలు సీఎంపర్యటనలో పాల్గొనే అవకాశం

 

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ఖమ్మం జిల్లాకు సీఎం రానున్నారు . ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో స్వయంగా పరిశీలించేందుకు సీఎం వస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.అయితే ఖమ్మం జిల్లాలోని బోనకల్లు మండలం లక్ష్మి పురం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలంచడంతోపాటు రైతులతో మాట్లాడతారు . అయితే సీఎం ఉదయం 11 .30 గంటలకు చేరుకొని కేవలం 45 నిముషాలు మాత్రమే సీఎం పర్యటన జిల్లాలో ఉంటుందని తెలుస్తుంది.ఎక్కడ నుంచి . కరీంనగర్‌, వరంగల్‌, జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించింది. రైతులెవరూ నష్టపోకుండా అంచనాలను నివేదికను సిద్ధం చేయాలని సూచించింది. మరో వైపు ఇప్పటికే మంత్రులు సైతం ఆయా జిల్లాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు.

అధికారుల హైరానా …

సీఎం వస్తున్నట్లు సాయంత్రమే సమాచారం రావడంతో జిల్లా కలెక్టర్ గౌతమ్ ,సీపీ విష్ణు ఎస్ వారియర్ ఏర్పాట్లను పరిశీలించేందుకు హుటాహుటిన బోనకల్లు మండలంలోని లక్ష్మిపురం వెళ్లారు . అక్కడ హెలిపాడ్ ఏర్పాటు తోపాటు తగిన బందోబస్తు కోసం సిబ్బందిని ఏర్పాటు చేశారు . జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ కూడా లక్ష్మీపురం వెళ్లారు .ఏర్పాట్లను పరిశీలించారు . ముఖ్యమంత్రి స్వయంగా తమ గ్రామానికి వస్తున్నదని తెలవడంతో అక్కడ ప్రజలు దెబ్బతిన్న తమ పంటలకు సహాయం అందుతుందని ఆశగా ఉన్నారు . ఇప్పటికే అధికారులు పంటలు దెబ్బతిన్న రైతులను గుర్తించారు . ఎమ్మెల్సీ తాతా మధు ఎంపీలు , ఎమ్మెల్యేలు సీఎంపర్యటనలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం ….

Related posts

వామ్మో …13 అడుగుల గిరినాగు పట్టివేత …!

Ram Narayana

పోర్నోగ్రఫీపై పోప్ ఫ్రాన్సిస్ హెచ్చరిక!

Drukpadam

దేశంలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయి: సీజేఐ ఎన్వీ రమణ!

Drukpadam

Leave a Comment