వరుపుల సత్యప్రభకు ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జ్ గా బాధ్యతలు…
ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియామకం
ఇటీవలి వరకు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న సత్యప్రభ భర్త
ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన వరుపుల రాజా
పార్టీ నేతల అభిప్రాయం మేరకే సత్యప్రభకు పదవి
ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ మూడు సీట్లను గెలుచుకోవడంతో ఆపార్టీ అధినేత జోరు పెంచారు . వచ్చే అసెంబ్లీ ఎన్నికలకోసం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు . తమదే అధికారం అన్నంత ధీమాతో ఉన్నారు . నియోజకవర్గాలవారీగా ఇంచార్జిలను నియమిస్తున్నారు . అందులో భాగంగా ఇటీవలనే మరణించిన వరుపుల రాజా స్థానంలో పత్తిపాడు నియోజకవర్గానికి ఇంఛార్జిని నియమించేందుకు ఆయన కుటుంబసభ్యులను చంద్రబాబు సంప్రదించారు .
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వరుపుల సత్యప్రభ నియమితులయ్యారు. ఇటీవలి వరకు ఆ పదవిలో కొనసాగిన ఆమె భర్త అనారోగ్యం కారణంగా మరణించారు. దీంతో పార్టీ నేతల నుంచి అభిప్రాయం సేకరించిన అనంతరం సత్యప్రభను ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిన్న అధికారికంగా ప్రకటించారు.
టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు డీసీసీబీ చైర్మన్‌గా రాజా పనిచేశారు. గుండెపోటుతో ఈ నెల 4న ఆయన మృతి చెందారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా ఆయన పాడె మోశారు. కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.