ఆంధ్రప్రదేశ్

కవిత పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. మళ్లీ పెరిగిన టెన్షన్!

కవిత పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. మళ్లీ పెరిగిన టెన్షన్!

  • మహిళను విచారించే విధానంపై ఈడీకీ మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ కవిత పిటిషన్
  • విచారణను 27వ తేదీకి వాయిదా వేసిన కోర్టు
  • ఈలోగా ఆమెను ఈడీ మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందంటూ ప్రచారం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ అంశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే కవితను ఈడీ మూడు సార్లు విచారించింది. ఇంకోవైపు మహిళను విచారించే విధానంపై ఈడీకి తగిన మార్గదర్శకాలను ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఈ నెల 24న విచారిస్తామని ఇంతకు ముందు చీఫ్ జస్టిస్ ధర్మాసనం తెలిపింది. అయితే, విచారణ తేదీని 27కి మార్చింది. ఈ నెల 27న జస్టిస్ అజయ్ రస్తోగి, బేలా త్రివేదీల ధర్మాసనం పిటిషన్ ను విచారించనుంది. మరోవైపు ఈడీ విచారణకు కవిత హాజరైన ప్రతిసారీ ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కవిత పిటిషన్ ను 27న విచారస్తామని సుప్రీంకోర్టు చెప్పడంతో… ఈలోగా ఆమెను ఈడీ మరోసారి విచారణకు పిలవొచ్చనే చర్చ ప్రారంభమయింది. ఈసారి విచారణకు వస్తే ఆమెను కచ్చితంగా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Related posts

టీఆర్ఎస్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన హైకోర్టు!

Drukpadam

శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత.. మరింతగా దిగజారిన పరిస్థితి…

Drukpadam

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ రూ.18,700 మాత్రమే.. వైరల్ అవుతున్న 1986 నాటి బిల్లు!

Drukpadam