Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోదీని కలవడానికి కారణం ఇదే: జగన్

మోదీని కలవడానికి కారణం ఇదే: జగన్

  • పోలవరం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్న జగన్
  • పోలవరంను పూర్తి చేసేది తానే అని వ్యాఖ్య
  • ప్రాజెక్టు గురించి మాట్లాడేందుకే మోదీని కలిశానన్న జగన్

పోలవరం ప్రాజెక్టు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చేసిందేమీ లేదని, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత కూడా ఆయనకు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం పనులన్నీ చంద్రబాబే చేశారని ఎల్లో మీడియా వార్తలు రాస్తోందని విమర్శించారు. 1995 నుంచి 2014 వరకు చంద్రబాబు నోట ఒక్కసారి కూడా పోలవరం మాట రాలేదని అన్నారు.

పోలవరంలో ఎక్కువ డబ్బులు వచ్చే పనులను ముందు చేశారని, ఆ తర్వాత తక్కువ డబ్బులు వచ్చే పనులు చేశారని చెప్పారు. కాఫర్ డ్యామ్ లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని అన్నారు. టీడీపీ అనాలోచిత నిర్ణయాల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని చెప్పారు. చంద్రబాబు ధ్యాస మొత్తం డబ్బుపైనే అని ఆరోపించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

పోలవరం తన కలల ప్రాజెక్టు అని వైఎస్సార్ చెప్పారని… ఆ ప్రాజెక్టును ప్రారంభించింది తన తండ్రేనని జగన్ చెప్పారు. పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేశామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గేట్లు పూర్తి చేశామని చెప్పారు. సీడబ్ల్యూసీ సిఫారసుల మేరకు తొలిదశలో పోలవరం డ్యామ్ ను 41.15 మీటర్ల ఎత్తు వరకు కడతామని… ఆ తర్వాత 45.7 మీటర్ల ఎత్తు వరకు డ్యామ్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటానికే ప్రధాని మోదీని కలిశానని చెప్పారు. ప్రాజక్టు తాత్కాలిక పనుల కోసం రూ. 15 వేల కోట్లు అడిగానని తెలిపారు.

Related posts

పెట్రోల్ ధరను తగ్గించిన సీఎం స్టాలిన్…

Drukpadam

మళ్లీ మనదే అధికారం: ముఖ్యమంత్రి జగన్!

Drukpadam

ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే తాటి చిచ్చు …

Drukpadam

Leave a Comment